వర్క్ ఫ్రమ్ హోమ్: ఆఫీసులకి రానంటున్న ఉద్యోగులు.. రప్పించే ప్రయత్నం చేస్తున్న యజమానులు..

-

కరోనా మహమ్మారి వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) అలవాటుగా మారిపోయింది. మొదట్లో కొంత మంది ఇబ్బంది పడ్డా ఆ తర్వాత అంతా సర్దుకున్నారు. ప్రస్తుతం ఇదొక నార్మల్ లైఫ్ గా మారింది. ఫ్లెక్స్ జాబ్స్ చేపట్టిన సర్వే ప్రకారం 2100మంది ఉద్యోగుల్లో చాలా మంది ఆఫీసులు లేకపోవడం వల్ల ఖర్చులు తగ్గుతున్నాయని చెబుతున్నారు. ఐతే వ్యాక్సినేషన్ పెరగడంతో ఆఫీసులకి వచ్చి పనిచేయమని యజమానులు అడుగుతున్నారు. యూరప్, అమెరికాకి చెందిన చాలా కంపెనీలు తమ ఉద్యోగులని ఆఫీసులకి రమ్మంటున్నాయి.

వర్క్ ఫ్రమ్ హోమ్ | Work From Home

కానీ కేవలం 30శాతం మంది మాత్రమే ఆఫీసులకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. గోల్డ్ మాన్ సాచ్ కంపెనీ తమ ఉద్యోగులని ఈ జూన్ నుండి ఆఫీసులకి రమ్మని కోరింది. గూగుల్, ఫోర్డ్ మోటార్, సిటీ గ్రూప్ ఇన్ కార్పోరేషన్ మొదలగు కంపెనీలు ఉద్యోగులకి ఆఫీసులకి రమ్మని, ఇక్కడ పూర్తి స్వేఛ్ఛ దొరుకుతుందని చెబుతున్నాయి. ఐతే కొంత మంది ఉద్యోగులు ఆఫీసులకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఆఫీసులకి వెళ్ళడం వల్ల టీం వర్క్ పెరిగి, పని మరింత ప్రభావవంతంగా అవుతుందని, అలాగే ఒకే చోట వర్క్ చేయడం వల్ల కలిగే యాంగ్జాయిటీని పోగొట్టుకోవచ్చని చెబుతున్నారు.

కాకపోతే అందరికీ వ్యాక్సినేషన్ ఇంకా పూర్తి కాలేనందున సహోద్యోగులతో ఇబ్బంది ఉంటుందన్న ఉద్దేశ్యంతో, వైరస్ సోకుతుందన్న భయం చాలామంది ఉద్యోగులని ఆఫీసులకి రానివ్వకుండా చేస్తుంది. అదీగాక అక్కడెక్కడో ఆఫీసు ఉంటే గుంపులు గుంపులుగా ఉన్న రైళ్ళలో, బస్సుల్లో అపసోపాలు పడుతూ ఇబ్బంది పడాలని లేదని మరికొందరు అంటున్నారు. మొత్తానికి వర్క్ ఫ్రమ్ హోమ్ కొందరికి ఒకలా, మరొకొందరికి మరోలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news