ప్రపంచంలో మనుషుల చేత నిర్మించిన రహస్యాలు ఎన్నో ఉన్నాయి..మరికొన్ని ప్రకృతి నిర్మించిన రహస్యాలు కూడా వున్నాయి.కొన్ని వింతలను తలపించే రహస్యాలు ఉన్నాయి.వాటి కోసం ఎప్పటినుండో తెలుసుకొనే ప్రయత్నిస్తున్నారు.కానీ అదొక అద్భుతంగా వున్న ప్రదేశాలు ఉన్నాయి.ఈ రోజు మనం తెలుసుకోనున్న మిస్టరీ గేట్ ఆఫ్ హెల్ అంటే నరకానికి ద్వారం అని పిలుస్తారు. ఈ గుడిలోపలికి ఎంట్రీ నరమానవులకు లేదు. ఎందుకంటే ఈ గుడిలోపలికి వెళ్లిన వారు మళ్ళీ తిరిగిరాలేదని అంటారు.
ఎన్నో మర్మాలను దాచుకున్న ఈ ఆలయం టర్కీలోని పురాతన నగరంలో ఉంది.హెరాపోలిస్ అనే నగరంలో అతి పురాతన ఆలయం ఉంది. దీనిని ‘గేట్ ఆఫ్ హెల్’ అని పిలుస్తారు. ఈ ఆలయం లోపలికి కాదు కదా.. చుట్టూ తిరిగే వ్యక్తులు కూడా తిరిగి రారు. అందుకనే ఈ ప్రదేశం ఎన్నో సంవత్సరాలు రహస్య ప్రాంతంగా ఉంది. ఎందుకంటే గ్రీకు దేవుడి విషపూరితమైన శ్వాస ఇక్కడికి వచ్చిన వారిని చంపుతుందని ప్రజలు విశ్వసించారు..ఆ పేరు కూడా తియ్యరు.
ఈ ఆలయాన్ని ‘ప్లూటో ఆలయం’ అని పిలుస్తారు. అంటే మృత్యుదేవుని ఆలయం. ఇక్కడ మృత్యుదేవత శ్వాస కారణంగా.. ఆలయాన్ని లేదా దాని పరిసరాలను సందర్శించే వారు చనిపోతారని నమ్ముతారు. తరచుగా మరణాలు సంభవిస్తున్నందున, ఈ ఆలయాన్ని ప్రజలు ‘నరక ద్వారం’ అని పిలుస్తారు..ఈ ఆలయం కింద నుండి విషపూరిత కార్బన్ డయాక్సైడ్ వాయువు నిరంతరం లీక్ అవుతుందని.. ఇది మానవులను, జంతువులు, పక్షులను తాకిన వెంటనే చంపేస్తుంది. కేవలం 10 శాతం కార్బన్ డయాక్సైడ్ వాయువు.. ఏ వ్యక్తినైనా 30 నిమిషాల్లో నిద్రపోయేలా చేయగలదు.
ఈ నేపథ్యంలో ఈ ఆలయంలోని గుహలో కార్బన్ డయాక్సైడ్ వంటి విష వాయువు పరిమాణం 91 శాతం ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యధిక పరిమాణంలో ఉన్న ఈ వాయువు విషంగా మారి ఆలయ సమీపంలోకి వెళ్లినవారిని ప్రాణాలను తీస్తుందని చెబుతున్నారు.అందుకే అక్కడ చనిపొతున్నారని, అక్కడకు ఎవరూ వెళ్ళే సాహసం చెయ్యరు..ఇదండీ ఆ అంతు చిక్కని రహస్యం..