ఇటీవల వైఎస్ షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సంఘటన పై ఏపీ సర్కార్ తరఫున కాకుండా, వ్యక్తిగతం గా మాత్రం సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. అయితే, జగన్ మాత్రం స్పందించడం లేదని.. సోషల్ మీడియాలో టీడీపీ చురకలు అంటిస్తోంది. అయితే, ఈ సంఘటనపై స్వయంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.
అరే…! అసలక్కడ మూడో వ్యక్తే లేరు. పచ్చ కుల మీడియా గాలి పోగేసి వార్తలు రాస్తోందని చెప్పేందుకు ఇదో మచ్చుతునక. తెలుగు ప్రజలకు పట్టిన ఈ దరిద్రం 2024తో వదిలిపోతుందంటూ ఎల్లో మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి.
రేపు ఆ కుల పేపర్లు, ఛానళ్లు చూడ్డానికి గుండె నిబ్బరం అవసరం. అఖిలపక్ష G-20 సదస్సులో ఎలాగైనా మోడీగారి చేయి పట్టుకుని ఫోటో దిగి “పీఎం-చంద్రం భేటీ – ఢిల్లీలో మారుతున్న రాజకీయ సమీకరణాలు” అని డ్రామోజీ, విగ్గు రాజు, tv5 నాయుడు హోరెత్తిస్తారు. వీళ్ళను మెంటల్ డాక్టర్ కు చూపించాల్సిందేనని ఫైర్ అయ్యారు.
అరే…! అసలక్కడ మూడో వ్యక్తే లేరు. పచ్చ కుల మీడియా గాలి పోగేసి వార్తలు రాస్తోందని చెప్పేందుకు ఇదో మచ్చుతునక. తెలుగు ప్రజలకు పట్టిన ఈ దరిద్రం 2024తో వదిలిపోతుంది. pic.twitter.com/toOa6l0xzt
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 6, 2022