అమెరికాలో ఫేస్బుక్ సెక్స్ ట్రాఫికింగ్ రిక్రూట్మెంట్ కేంద్రంగా వుంది: రిపోర్ట్..!

యూఎస్ లో సెక్స్ ట్రాఫికింగ్ రిక్రూట్మెంట్ ఫేస్బుక్ ద్వారా చాలా కామన్ గా జరుగుతోంది. హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్స్టిట్యూట్ చెప్పిన దాని ప్రకారం ఈ విషయాలు బయటపడ్డాయి. గత సంవత్సరం 59% యాక్టివ్ కేసులు సోషల్ మీడియా ద్వారా వచ్చాయని.. అది కూడా ఫేస్ బుక్ ద్వారా జరిగాయని తెలుస్తోంది.

41 శాతం ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి అని తేలింది. ఇంటర్నెట్ నిజంగా డామినెంట్ టూల్ గా మారిపోయింది. ఆన్ లైన్ ద్వారా సులువుగా రిక్రూట్ చేసుకుంటున్నారు. 2020 ఫెడరల్ హ్యూమన్ ట్రాఫికింగ్ రిపోర్ట్ డేటాని వెల్లడించింది. గత సంవత్సరం వాళ్ళు 579 యాక్టివ్ ప్రాసిక్యూషన్ మరియు 200 సివిల్స్ సూట్స్ ని కనుగొన్నట్లు చెప్పారు.

క్రిమినల్ కేసులు చూసుకున్నట్లయితే.. 1499 మంది ఉన్నట్టు తేలింది మరియు 1007 ఢిఫెండెండ్స్ మరియు 94 శాతం క్రిమినల్ ప్రాసిక్యూషన్ సెక్స్ ట్రాఫికింగ్ కింద ఉన్నట్లు గుర్తించారు. సెక్స్ ట్రాఫికర్స్ మహిళలు మరియు ఆడపిల్లల్ని ఎక్కువగా టార్గెట్ చేశారు.

పిల్లల నియామకానికి ఫేస్‌బుక్ అత్యంత సాధారణ వేదికగా మారిపోయింది. రిక్రూట్ చేయబడిన 65% మంది బాల బాధితులు ఫేస్‌బుక్ ద్వారా నియమించబడ్డారు. ఫేస్బుక్ యొక్క టీన్ వాడకం వలన ఈ ఫలితాలు వెలువడుతున్నాయి.

అమెరికా లో పెద్ద వాళ్ళు 70 శాతం మంది ఈ సైట్‌ ని తరచూ చూస్తారు. ఎక్కువ మంది ఫేస్ బుక్ కంటే మిగిలిన వాటిని ఇష్ట పడుతున్నా ఫేస్ బుక్ లో ఇలా సెక్స్ ట్రాఫికింగ్ లాంటివి జరుపుతున్నారు.

లైంగిక అక్రమ రవాణా మరియు పిల్లల దోపిడీ అసహ్యకరమైనవి మేము వాటిని ఫేస్‌బుక్‌లో అనుమతించము అని ఫేస్‌బుక్ ప్రతినిధి జీన్ మోరన్ ఆర్స్‌ తెలిపారు. ఈ రకమైన దుర్వినియోగాలను నిరోధించడానికి మరియు నియమాలను ఉల్లంఘించే ఏదైనా కంటెంట్‌ను తొలగించడానికి మాకు కొన్ని విధానాలు మరియు సాంకేతికత ఉంది అని అన్నారు.

ఇటువంటి వాటి కోసం మేము భద్రతా సమూహాలు, అక్రమ రవాణా నిరోధక సంస్థలు మరియు ఇతర సాంకేతిక సంస్థలతో కలిసి పని చేస్తున్నాము మరియు పిల్లల లైంగిక దోపిడీకి సంబంధించిన అన్ని స్పష్టమైన సంఘటనలను తప్పిపోయిన మరియు దోపిడీకి గురైన పిల్లల కోసం నేషనల్ సెంటర్ కి నివేదిస్తాము అని కూడా తెలిపారు.

దీని తర్వాత ఇన్‌స్టాగ్రామ్ మరియు స్నాప్‌చాట్ వున్నాయి. అయితే వీటిలో సగం మంది చిన్నారులు వున్నారని.. వాళ్ళు 14 మరియు 17 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు అని అన్నారు. 2020 లో బాధితుల నియామకానికి ఇంటర్నెట్ అత్యంత సాధారణ వేదికగా మారింది.

ఇంటర్నెట్ కారణంగా అనేక లైంగిక అక్రమ రవాణా పరిస్థితి చూస్తున్నాం, అయితే ఈ నేరాలపై దర్యాప్తు చేసి అవసరమైనవి చెయ్యక పోతే అధిక సంఖ్యలో ఫెడరల్ ప్రాసిక్యూషన్లుతో సమానంగా ఇంటర్నెట్ లో కూడా ఉంటాయి అని నివేదిక చెబుతోంది.