ఫాదర్స్ డే 2021: చరిత్ర.. విశేషాలు.. కొటేషన్లు.

-

భారతదేశంలో పితృ దినోత్సవాన్ని జూన్ మూడవ ఆదివారం రోజు జరుపుకుంటారు. ఈ ఏడాది జూన్ 20వ తేదీన మూడవ ఆదివారం వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజున తండ్రుల పట్ల ప్రేమను తెలియజేస్తూ, ఫాదర్స్ డే చరిత్ర గురించి తెలుసుకుందాం.

ఫాదర్స్ డే

అమ్మా, నాన్న ఇద్దరూ రెండు కళ్ళ లాంటి వారు. ఎవరు గొప్ప అంటే వీరే అని చెప్పలేం. కాకపోతే మన ప్రపంచంలో అమ్మకి ఇచ్చిన ప్రాముఖ్యత నాన్నకి ఇవ్వట్లేదన్నది ఒప్పుకోవాల్సిన సత్యం. సాధారణంగా నాన్న గురించి చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు. ఎందుకంటే నాన్నకి ప్రేమని ప్రకటించడం పెద్దగా తెలియదు. ఏదైనా సరే గుండెల్లో పెట్టుకునే నాన్న, ప్రేమని కూడా గుండెల్లో ఉంచుకుంటాడు. ఐతే ఈ ప్రత్యేకమైన రోజున తండ్రుల పట్ల బాధ్యతగా ఉంటూ వారితో కొంచెం సేపు గడిపినా అంతే చాలు.

ఇక ఫాదర్స్ డే చరిత్ర విషయానికి వస్తే, అమెరికాకి చెందిన 16ఏళ్ల అమ్మాయి సొనోరా లూయిస్ డాడ్, తన చిన్నతనంలోనే అమ్మని కోల్పోయింది. సోనోరా ఇంకా ఐదుగురు తమ్ముళ్ళ బాగోగులన్నీ నాన్నే చూసుకున్నాడు. అందువల్ల తన తండ్రి జ్ఞాపకార్థం జూన్ 5వ తేదీన ఫాదర్స్ డే జరపాలని ప్రభుత్వానికి లేఖ రాసింది.

ఆ పిటిషన్ సక్సెస్ కాలేదు. దాంతో ఫాదర్స్ డే గురించి ప్రచారం చేస్తూ అమెరికా మొత్తం తిరిగింది. ఆ విధంగా జూన్ మూడవ ఆదివారం రోజున ఫాదర్స్ డే పాపులర్ అయ్యింది.

నాన్న.. కొడుక్కి మొదటి హీరో.. కూతురుకి మొదటి ప్రేమ.

నిన్ను ప్రేమిస్తున్నానని నాన్న ఎప్పటికీ చెప్పడు, చూపిస్తాడు.

ప్రపంచంలోని ప్రతీ కూతురు విజయం వెనక వాళ్ళ నాన్న ఉంటాడు.

Read more RELATED
Recommended to you

Latest news