వేళ్ళు విరుస్తున్నారా…? అయితే తప్పక మీరు ఇవి తెలుసుకోవాలి..!

-

చాలా మందికి వేళ్ళు విరిచే అలవాటు ఉంటుంది చేతివేళ్లని కానీ కాళ్ళ వేళ్ళని కానీ అస్తమాను విరుస్తూ ఉంటారు. మీకు కూడా ఈ అలవాటు ఉందా అయితే కచ్చితంగా మీరు ఈ విషయాలని మీరు తెలుసుకోవాల్సిందే. ఏదైనా పని చేస్తూ మధ్యలో గ్యాప్ వచ్చినా లేదంటే తోచుబాటు అవ్వకపోయినా వేళ్ళు ని విరుస్తూ ఉంటారు ఇలా వేళ్ళని విరవడం వలన ఎంతో రిలాక్స్ గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ దానితో వేళ్ళు విరుస్తూ ఉంటారు అయితే నిజానికి ఈ అలవాటు వలన ఆర్థరైటిస్ వంటివి వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వేళ్ళు విరవడం మంచిదా కాదా దీనివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా లేకపోతే సమస్యలు ఉన్నాయా అనే విషయాలు తెలుసుకుందాం.

 

ఎక్కువగా చాలామంది వేళ్ళు విరుస్తూ ఉంటారు ఈ అలవాటు ఉంటే కొన్నాళ్ళకి ఎముకలు సమస్య వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. చాలాసేపు వేళ్ళని కానీ మెడని కానీ అలా ఉంచేస్తే అవి పట్టేస్తూ ఉంటాయి. కీళ్లు బిగుతుగా ఉండడం వల్ల రిలాక్స్ అవ్వాలని ఇలా చేస్తారు. చేతులు కాళ్ళ వేళ్ళని విరవడం వల్ల ఇబ్బంది ఉండదు. కానీ మెడ నడుముని కూడా ఇలా చేస్తారు. కానీ అది మంచిది కాదు. ఎందుకంటే ఇలా చేయడం వలన ఒత్తిడి కలుగుతుంది.

డిస్క్ జారిపోయే ప్రమాదం ఉంది. కొంతమందికి మసాజ్ చేయడం వల్ల మెడ నడుములోని బిగుతు తగ్గుతుంది కానీ ఇది ప్రమాదకరం. ఎందుకంటే వెన్నుపాము పై ఎంత ఒత్తిడి పెట్టాలనేది తెలీదు. దాంతో ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడమే మంచిది. కొంత మందికి నడిచేటప్పుడు కీళ్లనొప్పి వస్తూ ఉంటుంది. అటువంటప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. అయితే వేళ్ళని విరవడం నడుమును విరవడం మెడను విరవడం వంటివి అసలు మంచిది కాదు. వేళ్ళు విరుచుకోవచ్చు. కానీ మెడ నడుము భాగాలని మాత్రం అసలు విరవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news