మంటపుట్టిస్తున్న చింగారీ.. లైవ్ కాంటెస్ట్.. విజేతకు రూ. కోటి..!

-

భారత్ టిక్ టాక్ ను నిషేధించిన తర్వత షార్ట్ వీడియో యాప్ చింగారీ బాగా పాపులరైంది. టిక్ టాక్ బ్యాన్ చేయడంతో యూజర్లు అధిక సంఖ్యలో ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. గంటకు లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా గంటకు 2 లక్షల వ్యూస్ వస్తున్నాయి. దీంతో అతి కొద్ది కాలంలోనే ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య కోటికి దాటింది. ఈ సందర్భంగా కంపెనీ సరికొత్త మార్గంలో ముందుకు వచ్చింది.

Chingari
Chingari

‘చింగారీ స్టార్స్ టాలెంట్ కా మహా సంగ్రామ్’ పేరుతో కాంటెస్ట్ నిర్వహించబోతుంది. ఇందులో గెలుపోందిన వారికి రూ.కోటి అందించనుంది. ప్రతి రాష్ట్రం నుంచి బెస్ట్ కంటెంట్ క్రియేటర్లకు రూ.5 లక్షలు అందిస్తారు. ఈ కాంటెస్ట్ స్టేట్, నేషనల్ అనే రెండు స్టేజ్ లలో విడదీసి డాన్స్, సింగింగ్, యాక్టింగ్, మిమిక్రీ, కామెడీ, ఇన్నోవేషన్ అనే కేటగిరిలో వీడియోలు చేసి యాప్ లో అప్లోడ్ చేయాలి.ఈ కాంటెస్ట్ లో ఎవరైనా పాల్గొనవచ్చని, వీడియో నిడివి 15 నుంచి 60 సెకన్లు ఉండాలని చింగారీ యాఫ్ కో-ఫౌండర్ సుమిత్ ఘోష్ అన్నారు. లైవ్ ఓటింగ్ నిర్వహించి బెస్ట్ కంటెంట్ క్రియేటర్లకు ఆగస్టు 25న విజేతగా ప్రకటించి రూ.కోటి అందిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news