స‌రిలేరు నీకెవ్వ‌రు అంటూ మహేష్ బాబుపై పొగ‌డ్త‌ల వ‌ర్షం..!

-

టాలీవుడ్ హీరో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురుస్తోంది. పేద‌ల‌కి అండ‌గా ఉంటున్న మహేష్ చిన్నారుల‌కి హార్ట్ ఆప‌రేష‌న్స్ చేయిస్తూ వారి కుటుంబాల‌లో ఆనందం నింపుతున్నారు. గుండె సంబంధిత వ్యాధుల‌తో బాధ ప‌డుతున్న 1010 చిన్నారులకు హార్ట్ స‌ర్జ‌రీలు చేయించి రియ‌ల్ హీరో అనిపించుకున్నారు మ‌హేష్‌. ఆంధ్రా హాస్పిటల్స్, హీలింగ్ లిటిల్ హార్ట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో హెల్త్ చెకప్ లు నిర్వహించడమే కాకుండా అవ‌స‌ర‌మైన వారికి స‌ర్జ‌రీలు కూడా చేయిస్తున్నాడు.

కొద్ది రోజుల క్రితం భ‌వ్య శ్రీ అనే చిన్నారికి హార్ట్ స‌ర్జ‌రీ చేయించి ప్రాణదానం చేశారు. దీంతో ఆయన‌పై స‌రిలేరు నీకెవ్వ‌రు అంటూ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ ట్రెండ్ అవుతోంది. కాగా, మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సర్కార్ వారి పాట అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news