ఒక పరీక్ష కోసం 134 విమానాలను రద్దు చేశారు..!

-

టైటిల్ చదవగానే ఆశ్చర్యపోయారా? ఒక్క పరీక్షకు ఇంత ప్రాధాన్యమా? అంటారా? అవును.. అంత ప్రాధాన్యమున్న పరీక్ష ఏందబ్బా.. ఇంతకీ ఎక్కడ అంటారా? అయితే మనం ఓసారి సౌత్ కొరియా వెళ్లి రావాల్సిందే.

ఆ పరీక్ష పేరు నేషనల్ యూనివర్సిటీ ఎంట్రేన్స్. అవును.. ప్రతి సంవత్సరం జరిగే ఈ పరీక్షకు సౌత్ కొరియాలో చాలా ప్రాధాన్యత ఇస్తారట. మీకింకో విషయం తెలియదు. ఆ పరీక్ష రాసే విద్యార్థులకు ఆ దేశ అధ్యక్షుడే బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడంటే అర్థం చేసుకోవచ్చు. ఆ పరీక్షకు మొత్తం 5 లక్షల 95 వేల మంది విద్యార్థులు హాజరయ్యారట. ఆ పరీక్ష కూడా దాదాపు 9 గంటలు నిర్వహిస్తారట. ఇక.. ఆ పరీక్ష ఆధారంగానే అక్కడ విద్యార్థులకు యూనివర్సిటీల్లో సీటు, ఇతరత్రా ఉపయోగాలు ఉంటాయట. అందుకే దానికి అంత ప్రాధాన్యత.

ఇంతకీ ఆ పరీక్షకు, విమానానికి లింకేమిటోయ్. అసలు కథ చెప్పు అంటారా? అక్కడికే వస్తున్న.. పరీక్ష రాసే సమయంలో విమానాల శబ్దంతో వాళ్ల ఏకాగ్రత చెదిరిపోకూడదన్న ఉద్దేశంతో విమానాల ల్యాండింగ్స్, టేకాఫ్స్ నిలిపేశారట. 25 నిమిషాల పాటు సౌత్ కొరియాలో ఉన్న అన్ని ఎయిర్‌పోర్టుల్లో విమానాలను ఆపేశారట. 25 నిమిషాల సమయంలోనే పరీక్షలో భాగంగా… ఇంగ్లీష్ లిజనింగ్ టెస్ట్ ఉంటుందట. ఆ సమయంలో విద్యార్థులకు ఎటువంటి డిస్టబెన్స్ ఉండకూడదని సౌత్ కొరియా ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నదట. ట్రాఫిక్‌ను ఎక్కడికక్కడ ఆపేశారు. షాపులు, ఇతరత్రా అన్నీ క్లోజ్. విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లడానికి ప్రత్యేక వాహనాలు.. ఇలా ప్రపంచంలో ఏ పరీక్షకూ ఇవ్వని ప్రాధాన్యతను సౌత్ కొరియా ఈ పరీక్షకు ఇస్తుంది. అది అసలు సంగతి. ఇక.. ఈ పరీక్ష ఫలితాలు డిసెంబర్ 5న వెలువడుతాయట.

Read more RELATED
Recommended to you

Exit mobile version