ఢిల్లీలో అత్యంత ధనిక అభ్యర్థి గౌతమ్ గంభీరే.. ఆయన ఆస్తి ఎంతో తెలుసా?

-

ఢిల్లీ పశ్చిమం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మహబల్ మిశ్రా 45 కోట్లుగా తన ఆస్తులను చూపించి.. అత్యధిక ఆస్తులు ఉన్న రెండో అభ్యర్థిగా నిలిచారు.

దేశంలో ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్నది. ఎక్కడ చూసినా.. లోక్ సభ ఎన్నికల గురించే చర్చ. ఇప్పటికే మూడు విడుతల పోలింగ్ పూర్తయింది. ఇంకా కొన్ని చోట్ల పోలింగ్ జరగాల్సి ఉంది. అన్ని చోట్ల పోలింగ్ పూర్తయ్యాక మే 23 న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.

ఎన్నికల్లో నామినేషన్ అంటే అంత ఈజీ కాదు కదా. ఉన్నవి లేనివి అన్నీ చెప్పాలి. ఏది దాచినా సమస్యే. ఆస్తులు ఎన్ని ఉన్నాయి.. అప్పులు ఎన్ని ఉన్నాయి.. కేసులు గట్రా ఏమైనా ఉన్నాయా? ఇలా ప్రతి విషయాన్ని నామినేషన్ ఫాంలో వెల్లడించాల్సిందే.

కట్ చేసి.. ఢిల్లీ ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ దగ్గరికి వెళ్దాం పదండి. ఎందుకంటే.. ఆయన నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా. నామినేషన్లలో ఆయన ఆస్తులు అన్నీ వివరించారు. ఆయన ఆస్తులు ఎంతో తెలుసా? రూ.147 కోట్లు. దీంతో ఢిల్లీలోనే అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా గౌతమ్ గంభీర్ రికార్డుకెక్కారు. తనపై ఓ కేసు ఉన్నట్టు, తన భార్య నటాషా గత సంవత్సరం ఆదాయం 6.15 లక్షలుగా పేర్కొన్నారు.

ఢిల్లీ పశ్చిమం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మహబల్ మిశ్రా 45 కోట్లుగా తన ఆస్తులను చూపించి.. అత్యధిక ఆస్తులు ఉన్న రెండో అభ్యర్థిగా నిలిచారు. ఇక.. మిగితా వాళ్లలో ఢిల్లీ దక్షిణం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆస్తులు 12.14 కోట్లు, బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ ఆస్తి 24 కోట్లు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆస్తి 4.92 కోట్లుగా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version