నాలుగేళ్లకే ఇంట్లో తల్లిదండ్రుల ముందే దర్జాగా సిగిరెట్లు తాగుతున్న పిల్లలు..

-

సిగిరెట్‌ స్మోకింగ్‌ ఆరోగ్యానికి మంచిది కాదు.. దీనికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి. కానీ ఒక వయసు వచ్చాక అది ఎలా ఉంటుందో టేస్ట్‌ చేయాలి అన్న ఉత్సాహం దాదాపు చాలామంది అబ్బాయిలకు ఉంటుంది. టేస్ట్‌ చేయడానికి స్టాట్‌ చేసి ఆ తర్వాత ప్రతి సమస్యకు అదే సొల్యూషన్‌గా చేసుకుని చివరికి బానిసవులుతారు. అయితే ఇదంతా బీటెక్‌ వయసు వచ్చినప్పుడు స్టాట్‌ అవుతుంది. కానీ కనీసం నాలుగేళ్లు కూడా రాని అబ్బాయిలు సిగిరెట్‌కు బానిసలైతే.. ఒకరు కాదు ఇద్దరు కాదు.. దేశంలో దాదాపు పిల్లలు అంతా అలానే ఉన్నారు.

పిల్లలు చాక్లెట్ కోసం ఏడ్చే వయసులో ఇండోనేషియాలో సిగరెట్ పీల్చుకుంటారు. అది కూడా తన తల్లిదండ్రుల ముందే. ఇక్కడ పిల్లలు చిన్నవయసులోనే సిగరెట్లకు బానిసలుగా మారుతున్నారు. పిల్లలు రోజుకు రెండు ప్యాకెట్ల సిగరెట్లు తాగుతారు. ఈ విషయం ఈ పిల్లల తల్లిదండ్రులకు కూడా తెలుసు. పిల్లలు వారి ముందు హాయిగా సిగరెట్లు తాగుతారు. ఇండోనేషియాలో పిల్లల ఈ వ్యసనాన్ని కెనడియన్ ఫోటోగ్రాఫర్ వెల్లడించారు. మిచెల్ సియు అనే ఈ ఫోటోగ్రాఫర్ ఈ దేశపు పిల్లలు స్మోకింగ్‌లోకి ఎలా వచ్చారో చూపించారు. కేవలం మూడు, నాలుగు సంవత్సరాలు మాత్రమే వయస్సు ఉన్న పిల్లలు కూడా సిగరెట్లను విపరీతంగా తాగుతారు. తల్లిదండ్రులు కూడా వారిని ఏమీ అనడం లేదు. కెనడా ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇందులో చిన్న పిల్లలు చాలా హాయిగా సిగరెట్ తాగడం వారికి చాలా మామూలు విషయంలా ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇండోనేషియాలో ధూమపానం అతిపెద్ద సమస్యగా మారిందీ. ఈ అలవాటు పెద్దలనే కాదు పిల్లలకు కూడా పాకింది. పొగాకు ఉత్పత్తిలో ఈ దేశం ఐదో స్థానంలో ఉంది. దీంతో పాటు ఇక్కడ విపరీతమైన ప్రచారం కూడా చేస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా దోహదపడుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా దీనిని నిషేధించడం లేదు. ఇండోనేషియాలోని పది నుంచి పద్నాలుగేళ్ల పిల్లల్లో ఎక్కువ మంది ప్రతిరోజూ మూడు సిగరెట్లు తాగుతుండగా, మొత్తం జనాభాలో 60 శాతం మంది స్మోక్ చేస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

మూడు నాలుగేళ్ల వయసు నుంచే సిగిరెట్‌ తాగుతుంటే.. రేపు వారి భవిష్యత్తు ఏం అవుతుంది. కనీసం ఇరవై ఏళ్లు వచ్చే వరకైనా బతుకుతారా..? ఆరోగ్యం పాడవకుంటా ఉంటుందా..? మన దగ్గరే నయం అనేక రకాల నియమాలు రూపొందించబడ్డాయి. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో స్మోక్ చేయడం నిషేధం. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఎవరూ సిగరెట్లు అమ్మకూడదని రూల్‌ ఉంది. ఆ దేశంతో పోల్చుకుంటే.. మనం చాలా బెటర్‌ అని నెటిజన్లు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news