ఏపీలో బీజేపీ పూరిస్తోన్న ”శంఖ‌నాదం”…

-

ఏపీలో బీజేపీ దూకుడు పెంచింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి నేతృత్వంలో కీల‌క స‌మావేశం జ‌రిగింది. పార్టీ సోష‌ల్ మీడియా, ఐటీ ప్ర‌తినిధుల‌కు వ‌ర్క్ షాప్ ఏర్పాటుచేశారు. సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ప‌ని చేయాల‌నే అంశంపై ఈ స‌మావేశంలో శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. ‘శంఖ‌నాదం’ పేరిట నిర్వ‌హించిన ఈ స‌మావేశానికి పార్టీ సీనియ‌ర్ నేత పునీత్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా పురంధేశ్వ‌రీ ప్రారంభోప‌న్యాసం చేవారు.

BJP-party

సోష‌ల్ మీడియా ఎంత విస్త‌రించిందో, ఎంత కీల‌కంగా ప‌ని చేస్తోంద‌నే విష‌యాన్ని వెల్ల‌డించారు. దీన్ని పార్టీ కోసం, పార్టీ బ‌లోపేతం కోసం, పార్టీ చేస్తోన్న సంక్షేమ అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి ఎలా తీసుకెళ్ళాల‌నే అంశాల‌ను ఈ వ‌ర్క్ షాప్ ద్వారా తెలియ‌జేస్తామ‌న్నారు. ఢిల్లీ నుంచి వ‌చ్చిన పునీత్ ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తార‌ని తెలిపారు.

‘నా భూమి, నాదేశం‌’ కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టిందనన పురంధేశ్వ‌రి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా సెప్టెంబరు 1 నుంచి 15 వరకు అన్ని గ్రామాల్లో మట్టిని సేకరిస్తామని, అలాగే పట్టణాలు, నగరాల్లో బియ్యం సేకరిస్తామనన్నారు. ఈ మట్టిని ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ అన్ని రాష్ట్రాల మట్టితో క‌లిసి అమృత వనం ఏర్పాటు చేస్తామని వివ‌రించారు. రాఖీ ప‌ర్వ‌దినాన మ‌హిళ‌ల‌కు కానుక‌గా గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లను మోడీ స‌ర్కార్ త‌గ్గించింద‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే మ‌హిళ‌ల‌కు ప్రాధాన్య‌త ఇచ్చే, ఆర్ధిక భ‌రోసా క‌ల్పించే ఎన్నో ప‌ధ‌కాల‌ను ప్ర‌ధాని అమ‌లు చేస్తున్నారని గుర్తు చేశారు. ఎన్నిక‌లు స‌మీపిస్తోన్న స‌మ‌యంలో స‌న్న‌ద్దం కావాల‌ని ఆమె పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news