భారత్, పాక్ మ్యాచ్ మధ్యలో ఫన్నీ ఘటన.. వీడియో వైరల్

720

ఓవైపు భారత్ క్రికెట్ ఫ్యాన్స్.. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్… తమ దేశ టీమ్ ను ఎంకరేజ్ చేస్తూ ఉర్రూతలూగిస్తుంటారు. అది సాధారణం.

ప్రపంచమంతా నిన్న భారత్, పాక్ మ్యాచ్ గురించే చర్చించింది. భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. భారత్, పాక్ మధ్య పోరు అంటేనే ప్రపంచమంతా ఆసక్తి. ఏ టోర్నీ అయినా సరే… అది భారత్, పాక్ మధ్య మ్యాచ్ అయితే దాంట్లో ఉండే కిక్కే వేరు.

స్టేడియం కూడా కిక్కిరిసిపోవాల్సిందే. ఓవైపు భారత్ క్రికెట్ ఫ్యాన్స్.. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్… తమ దేశ టీమ్ ను ఎంకరేజ్ చేస్తూ ఉర్రూతలూగిస్తుంటారు. అది సాధారణం. అయితే.. నిన్నటి మ్యాచ్ మధ్యలో ఓ ఫన్నీ సంఘటన జరిగింది.

పాకిస్థాన్ కు చెందిన ఓ లేడీ ఫ్యాన్… లేచి.. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ గట్టిగా అరిచింది. అదే సమయానికి ఆమెకు వంత పాడుతూ… వేరే వాళ్లు కూడా గట్టిగా చప్పుడు చేస్తూ పాకిస్థాన్ జిందాబాద్ అన్నారు. ఇంతలోనే అక్కడే ఉన్న కొందరు ఇండియన్ ఫ్యాన్స్.. వెంటనే లేచి గణపతి బప్పా మోరియా.. అంటూ గట్టిగా అరిచారు. అంతే.. పాకిస్థాన్ ఫ్యాన్స్ అంతా వెంటనే సైలెంట్ అయిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.