మౌలిక సదుపాయాల నిధుల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి ఆర్థిక సంస్థ (డిఎఫ్ఐ) ను రూపొందించాలని భారత్ నిర్ణయించింది. అయితే ఇది రూ. 20,000 కోట్ల ఫండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయబడుతుంది. మూడేళ్లలో 5 లక్షల కోట్ల రుణ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆర్థిక మంత్రి తెలిపారు.
నయా భారతదేశాన్ని నిర్మించడానికి ఫండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. కొత్త ప్రాజెక్టులు, ఇప్పటికే ఉన్న ఇన్ఫ్రా విస్తరించడం మరియు పాత ఇన్ఫ్రాను పునరుద్ధరించడం అవసరం. దీనిలో మొత్తం 7000 ప్రాజెక్టులను గుర్తించారు. దీని కోసం 111 లక్షల కోట్లు అవసరం.
DFI క్రెడిట్ మరియు క్రెడిట్ ప్లస్ సేవలను అందించడం మాత్రమే కాకుండా ఎన్నో విధాలుగా పని చేస్తుంది. రిస్క్ తగ్గించడం మొదలు నైతిక నిధులను యాక్సెస్ చేయడం ఇలా ఎంతగానో సహాయపడతాయి.
ఇది ఇలా ఉంటే ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ దేశంలో ఉండే పౌరులను ఒక పేరు, టాగ్ లైన్ మరియు లోగో డిజైన్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ కి ఇవ్వాలని చెప్పింది.
ఈ పేరు, లోగో, ట్యాగ్ లైన్ ద్వారా అందించే ఆక్టివిటీస్ ని చూపించాలి అని చెప్పింది. పేరు, ట్యాగ్ లైన్ మరియు లోగో డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సెట్టింగ్ ని చూపించాలని చెప్పింది. 15 ఆగస్ట్ 2021 వరకు కూడా ఎంట్రీలు పంపించొచ్చు.
క్రియేటివిటీ, తయారుచేసిన థీమ్ మొదలైన వాటిని పరిగణలోకి తీసుకొని విజేతని ఎంపిక చేయడం జరుగుతుంది అని చెప్పింది.
బహుమతి వివరాలు:
ప్రతి కేటగిరీలో కూడా క్యాష్ ప్రైజ్ ని ఇవ్వనుంది. మొదటి బహుమతి, రెండవ బహుమతి మరియు మూడో బహుమతి పేరుకి, టాగ్ లైన్ కి మరియు లోగో కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
క్యాటగిరి: మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడో బహుమతి
పేరు: ఐదు లక్షల రూపాయలు, మూడు లక్షల రూపాయలు, రెండు లక్షల రూపాయలు
ట్యాగ్‌లైన్: ఐదు లక్షల రూపాయలు, మూడు లక్షల రూపాయలు, రెండు లక్షల రూపాయలు
లోగో: ఐదు లక్షల రూపాయలు, మూడు లక్షల రూపాయలు, రెండు లక్షల రూపాయలు