తల్లి కిరాణా సరుకుల కోసం పంపిస్తే పెళ్లి చేసుకుని వచ్చాడు…!

-

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేయడం తో ప్రజలు అందరూ కూడా అవసరం ఉంటేనే బయటకు వస్తున్నారు. లేకపోతే మాత్రం బయటకు రావడానికి భయపడుతున్నారు. కాని ఉత్తరప్రదేశ్ లో ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఉత్తర ప్రదేశ్‌ చెందిన ఘజియాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి కిరాణా సరుకుల కోసం అని వెళ్లి భార్యతో తిరిగి రావడం చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.

అతని తల్లి ఈ పరిణామం చూసి షాక్ అయ్యారు. తన కొడుకు వ్యవహారాన్ని చూసి ఏం చెయ్యాలో అర్ధం కాక ఆమె పోలీసులను ఆశ్రయించారు. సాహిబాబాద్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని జాతీయ మీడియా చెప్పింది. “నేను ఈ రోజు కిరాణా సరుకులు కొనుగోలు చేయడానికి నా కొడుకుని పంపించా. కాని అతను మాత్రం తిరిగి వచ్చే సమయంలో భార్యను తీసుకుని వచ్చాడు. నేను ఈ వివాహాన్ని అంగీకరించేది లేదని ఆమె స్పష్టం చేసింది.

ఈ వివాహం రెండు నెలల క్రితం హార్డ్‌వార్‌లోని ఆర్య సమాజ్ మందిరంలో జరిగినట్టు జాతీయ మీడియా చెప్పింది. లాక్ డౌన్ తర్వాత వారి వివాహ బంధం చట్ట రీత్యా ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాక్షులు ఎవరూ లేకపోవడం తో తమకు ఆ సమయంలో వివాహ దృవీకరణ పత్రం రాలేదని పెళ్లి తర్వాత హరిద్వార్ వెళ్ళాలి అనుకున్నా గాని అది సాధ్యం కాలేదని 26 ఏళ్ళ పెళ్లి కొడుకు చెప్పాడు. ఆమె అతను రెండు నెలల నుంచి ఒక హోటల్ లో ఉంచగా లాక్ డౌన్ కారణంగా  ఖాళీ చెయ్యాలి అని చెప్పడంతో ఆమెను ఇంటికి తీసుకుని వచ్చినట్టు చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news