ఆ బైక్‌పై త్రిబుల్ రైడింగ్‌ చేసినా ఏం కాదు.. ఎందుకంటే..!!

-

అవసరం మనిషితో ఏదైనా చేయిస్తుంది అంటారు..అవసరాల నుంచే కొత్త కొత్త ఆవిష్కరణలు పుడతాయి. అలాంటి ఓ ఆవిష్కరణ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది. ఓ యువకుడు 6 మంది కలిసి ప్రయాణించగలిగే ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేశాడు. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎల్లప్పుడూ భారతీయ ప్రతిభను ప్రోత్సహిస్తుంటారు. సోషల్ మీడియాలో సామాన్యులకు సంబంధించిన పోస్ట్‌లను షేర్ చేస్తూనే ఉంటారు. ఇటీవల అతను ఒక యువకుడి వీడియోను పోస్ట్ చేశాడు. అందులో ఓ యువకుడు ప్రత్యేకమైన బైక్-ఆటో రిక్షా(Electric bike cun auto rickshaw)ను నడుపుతున్నాడు.

 

ఈ వాహనాన్ని ఎలక్ట్రిక్ బైక్ లేదా ఆటో రిక్షా అని కూడా పిలవొచ్చట.. ఎందుకంటే దీనిపై ఒకేసారి 6 మంది కూర్చోగలరు. “చిన్న మార్పుల తర్వాత, ఈ వాహనాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించవచ్చు. యూరప్‌లోని రద్దీగా ఉండే పర్యాటక ప్రదేశాలలో ఈ వాహనాన్ని టూర్ బస్సుగా ఉపయోగించవచ్చని… గ్రామీణ ప్రాంతాల్లో రవాణా ఆవిష్కరణలను చూసి నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాని ట్విట్టర్‌లో ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో యువకుడు గ్రామంలో ప్రత్యేకమైన బైక్‌ను నడుపుతున్నాడు. అతను బైక్ ముందు కూర్చున్నాడు. అతని వెనుక మరో 5 సీట్లు ఉన్నాయి. ఒక టైరు ముందు, ఒకటి వెనుక ఉంది. బైక్‌పై ముందు భాగంలో LED లైట్ కూడా ఉంది. బైక్‌ను తానే తయారు చేశానని, దాని ధర 12 వేల రూపాయలు అని యువకుడు తెలిపాడు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు నడుస్తుండగా, దీన్ని ఛార్జ్ చేయడానికి రూ.10 మాత్రమే ఖర్చు అవుతుందని వెల్లడించాడు.

నెటిజన్ల నుంచి ప్రతికూల స్పందన..

ఈ వీడియోకు 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే చాలా మంది తమ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం ద్వారా తెలిపారు. చాలా మంది ఈ ప్రత్యేకమైన ఆలోచనను ప్రశంసించారు కానీ.. కొందరు దాని లోపాలను కూడా లెక్కించారు. ఒక వ్యక్తి “ఈ వాహనం జూ, పార్క్ కార్పొరేట్ కాంప్లెక్స్ వంటి ప్రదేశాలలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది, కానీ రద్దీగా ఉండే రోడ్డు మీద నడపడం సురక్షితం కాదు. దీనికి కారణాలు తక్కువ టర్నింగ్ రేడియస్, కార్నర్ చేస్తున్నప్పుడు సెంట్రిఫ్యూగల్ బ్యాలెన్స్, కఠినమైన రోడ్లపై సస్పెన్షన్, లగేజీ స్థలం లేకపోవడం అధిక లోడ్‌లో బ్యాటరీ సామర్థ్యం తక్కువ”అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news