మురుగునీటిలో బంగారం.. 100కు పైగా కుటుంబాల జీవనాధారం అదే..

-

నదిలో బంగారం పారుతున్న వార్తలను మనం విన్నాం.. ఆ బంగారం కోసం అక్కడి వారు ఎంత కష్టపడతారో కూడా సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్నాం.. కానీ మురుగు నీటిలో బంగారం ఉంటుందని వార్త మీరెప్పుడైనా విన్నారా..? అక్కడ మురుగు నీటిలో బంగారం ఉంటుందట.. దానికోసం..కొందరు దిగి తెగ కష్టపడతారు. మురుగులో వ్యర్థాలు వెతుకుతారు కానీ..బంగారం ఏంట్రా అనుకుంటున్నారా..?
బంగారం దుకాణాలు ఉండే చోట కొందరు అక్కడ ఉండే కాల్వలలో దిగుతుంటారు. బంగారు దుకాణాలలో ఊడ్చిన తర్వాత చెత్తను దగ్గరలోని కాల్వలోనికి వేస్తుంటారు. కొందరు ఆ మురుగులోనికి దిగి బేసిన్ సహయంతో అనేక సార్లు వ్యర్థాలను శుభ్రం చేసి.. అక్కడ ఆ రేణువులలో చిన్న బంగారు కణాలను వారు సేకరిస్తారు. వాటిని తిరిగి శుభ్రం చేసి, ఇతర బంగారు దుకాణాలలో అమ్మి సొమ్ముచేసుకుంటారట.. ఇదే వారికి జీవనాధారం. ఇది ఎక్కడో కాదు..మన ఇండియాలోనే..
ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్‌లో వందలాది కుటుంబాలు మురుగు నీటి నుంచి ప్రతిరోజు బంగారం కణాలను సేకరిస్తుంటారు. అక్కడ అనేక విధాలుగా శుభ్రం చేస్తారు. వీరు ప్రధానంగా.. ఘంటాఘర్‌లో ఉన్న సోనార్ పట్టీలో ఎక్కువగా ఉంటున్నారు. దాదాపు వందలాది కుటుంబాలు ఇలా కాలువల నుంచి చెత్తను సేకరించి జీవిస్తుంటారు. వీరిని నిహారీలు అని అంటారు. ఇలా దాదాపు వందకు పైగా కుటుంబాలు ఈ పనిచేస్తుంటాయి. ఈ విధంగా వ్యర్థాలలోని కణాలను సేకరించి వాటిని శుభ్రం చేసి, బంగారం దుకాణాలలో విక్రయిస్తుంటారు. దీనితో వీరు కుటుంబాన్ని పోషించుకుంటారు. కాగా, నాగ్ పూర్, ఝాన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన బంజారాలు ఈ పనిచేస్తారని సమాచారం.
ఇలా సేకరించడం వల్ల కేవలం వారు కుటుంబాలను మాత్రమే పోషించుకోగలుగుతున్నారు. కానీ ఆ కష్టం మాత్రం చాలా ఉంది. పాపం దొరికే కాసింత బంగారం కోసం.. ఆ మురుగులో దిగి అనారోగ్యం భారిన పడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్తమాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు వీరిపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news