బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతూ వుంటారా..? అయితే మీకు గుడ్ న్యూస్..!

-

మన చుట్టూ ఉండే చాలా మంది అస్తమాను ఇతరులను తిడుతూ ఉంటారు. పైగా అలా చేసే వాళ్ళని మనం మంచి వాళ్ళ కింద పరిగణన లోకి తీసుకోము. అయితే మీకు ఒక విషయం తెలుసా..? అలా దూషిస్తూ ఉంటే మైండ్ చాలా ఆరోగ్యంగా ఉంటుందట. అయితే మరి ఇతరులు తిట్టడం వల్ల ఎలా ఆరోగ్యంగా ఉంటాము అనేది చూద్దాం..!

సాధారణంగా చాలా మంది ఇతరులుని బూతులు తిడుతూ ఉంటారు. అలాగే చాలా మంది స్నేహితులు మధ్య గొడవలు పడి ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల స్నేహితులకి కోపం వస్తుంది. కానీ ఇలా తిట్టుకోవడం వలన రిలీఫ్ గా ఉంటుందట. గుండె బరువు తగ్గి తేలికగా ఉంటుందట.

నేటి కాలం లో చాలా మంది బయటకి ఓపెన్ గా తిడుతూ ఉంటున్నారు. అలానే ఆనందం కలిగినప్పుడు కూడా ఏదో ఒకటి తిడుతూ ఉంటారు. దీని వల్ల మైండ్ రిలీఫ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలానే మనల్ని మనం కొన్ని కొన్ని సార్లు కోపంగా ఉన్నప్పుడు తిట్టుకుంటూ ఉంటాం.

సైన్స్ ఇలా తిట్టుకోవడం వల్ల కోపం తగ్గుతుంది మరియు రిలీఫ్ గా ఉంటుందని ప్రూవ్ చేసింది. ఇలా ఇతరులను తిట్టడం, స్నేహితులుని తిట్టడం లేదంటే మనల్ని మనం తిట్టుకోవడం వల్ల మైండ్ ఫ్రెష్ గా ఉంటుందని కీన్ యూనివర్సిటీ చేసిన పరిశోధన ప్రకారం తేలింది.

గుండె కూడా ఎంతో కంఫర్ట్ గా ఉంటుంది. అలానే ఇలా తిట్టుకోవడం వల్ల మన సమస్యలను మనమే ఫైట్ చేసుకోగలము. కొంత మంది విద్యార్థులు మీద యూనివర్సిటీ పరిశోధన చేయగా ఈ విషయాలు బయటపడ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news