ఆంధ్రప్రదేశ్ లో అధికారుల అవినీతి వ్యవహారాలు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా సీరియస్ గా ఉన్నారని ప్రచారం గత కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. ముఖ్యమంత్రి కొన్ని కొన్ని సార్లు చూసిచూడనట్టుగా ముందుకు వెళ్లడం కూడా జరిగింది. ఇప్పుడు అదే కొంత మంది అధికారులకు అలుసుగా మారింది అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారుల అవినీతి చేసినా అధికారులు మంత్రులకు ఎమ్మెల్యేలకు గాని సహకరించి అవినీతిలో భాగం పంచుకున్న సరే ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది.
అందుకే ముఖ్యమంత్రి జగన్ కొంతమంది విషయంలో కాస్త కఠినంగా ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న జగన్ అధికారుల అవినీతి చేస్తే వదిలే ప్రసక్తే లేదని భావిస్తున్నారు. అందుకే ముందు రెవెన్యూ శాఖ మీద దృష్టి సారించారు. రెవెన్యూ శాఖలో కొంతమంది ఎమ్మార్వోలు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడంతో క్షేత్ర స్థాయిలో అవినీతి పెరిగిపోతుందని ఎమ్మెల్యేలకు ఎమ్మార్వోలు ఎక్కువగా సహకరిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ కొన్ని నివేదికలు కూడా తెప్పించుకున్నారు.
దీనికి సంబంధించి ఏసీబీ అధికారులతో కూడా ఇప్పటికే జగన్ మాట్లాడినట్టు సమాచారం. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో భూ కబ్జాలు విషయంలో అలాగే విశాఖ జిల్లాలో భూ కబ్జాలు విషయంలో జగన్ ఆయన సీరియస్ గా ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి.