గూగుల్ హెచ్చరిక : క్రోమ్ అప్డేట్ చేసుకోండి.. లేదంటే మీ మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం..!

ప్ర‌పంచ వ్యాప్తంగా ఇంట‌ర్నెట్ యూజ‌ర్లు వాడే బ్రౌజ‌ర్ల‌లో గూగుల్ క్రోమ్ మొద‌టి స్థానంలో ఉంది. గూగుల్ క్రోమ్ 46.68%, స‌ఫారీ 36.64%, మొజిల్లా 9.71% యూజర్లు వాడుతున్నారు. విడోస్‌, ఆండ్రాయిడ్‌ లలో గూగుల్‌ క్రోమ్‌ను వాడ‌కం 90 శాతం వ‌ర‌కు ఉంటుంది. ఇక ఒపెరా, మైక్రోస్టాఫ్ట్‌ ఎడ్జ్‌ వంటి బ్రౌజర్‌లు కూడా గూగుల్ పైనే ఆధార‌ప‌డి ఉన్నాయి.

గూగుల్ క్రోమ్ ఓల్డ్ వెర్ష‌న్ వాడుతున్న‌వారు లేటెస్ట్ వెర్ష‌న్‌కు అప్‌డేట్ చేసుకోవాలని గూగుల్ సూచించింది. పాత వెర్ష‌న్‌ల‌లో ఉన్న బ‌గ్ కార‌ణంగా హ్యాక‌ర్లు డాటాను దొంగిలించే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.మీ బ్రౌజ‌ర్ వెర్ష‌న్ ను 91.0.4472.164 కు అప్‌డేట్ చేసుకోవ‌డం ద్వారా మీ డాటాను భ‌ద్రంగా ఉంచుకోవ‌చ్చ‌ని గూగుల్ బ్లాగ్‌లో తెలిపింది.

పెగసాస్ అంటే ఏమిటి?

ఈ పెగసాస్ అనేది ఒక సాఫ్ట్‌వేర్. ఇది మీ స్మార్ట్ ఫోన్ యాక్టివిటీని అంతా కూడా ట్రాక్ చేస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లలో డేటాని చూడడానికి దాడి చేసేవారు దీనిని ఇన్‌స్టాల్ చేయవచ్చు.

పెగాసస్ హ్యాక్ | Pegasus Hack
పెగాసస్ హ్యాక్ | Pegasus Hack

 

అయితే దీనిని ఎందుకు తీసుకొచ్చారు అనేది చూస్తే… ప్రభుత్వ సంస్థలకు సహాయం చేయడానికి ఎన్ఎస్ఓ తీసుకొచ్చింది. ఉగ్రవాదం మరియు నేరాలను నిరోధించడానికి మరియు దర్యాప్తు చేయడానికి ఈ సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుందని అంటున్నారు.

ఇది ఎలా పని చేస్తుంది?

పెగసాస్ ఇప్పుడు ఏ క్లిక్ చెయ్యకుండానే దాడి చేస్తుంది. హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా టార్గెట్ చేసినవాళ్లు డేటాని ఇది హ్యాక్ చేస్తుంది.

ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌లలో, స్పైవేర్ మెయిల్స్ పై వుండే డేటాని చూస్తుంది. అదే ఆండ్రాయిడ్ ఫోన్స్ లో అయితే , స్పైవేర్ 4.4.4 మరియు అంతకు మించి వుండే ఫోన్‌ గ్రాఫిక్స్ లైబ్రరీలో డేటాని టార్గెట్ చేసింది. చాలా మంది దాడి చేసేవారు వాట్సాప్‌లోని దుర్బలత్వాన్ని కూడా ఉపయోగించుకున్నారు.

మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవచ్చు?

ముందు మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్ టు డేట్ ఉంచడం.
సిస్టమ్‌ లో ఏ యాప్స్ ని సైడ్‌లోడ్ చేయకూడదు.
చివరగా, వినియోగదారులు యాప్స్ ని ఉపయోగించడాన్ని ఆపివేసి, వెబ్ బ్రౌజర్‌లో ఇమెయిల్‌లు, సోషల్ మీడియా మరియు మరిన్నింటిని చెక్ చెయ్యండి.