అదే పనిగా స్మార్ట్ ఫోన్ చూస్తున్నారా? ఐతే మీరు డూమ్ స్క్రోలింగ్ వలలో చిక్కుకున్నట్టే..

-

మహమ్మారి వచ్చాక మనుషులతో మాటలు తగ్గిపోయి స్మార్ట్ ఫోన్లకి తలల్ని అప్పగించేసారు. పైకెత్తితే కొడతారన్న రీతిలో వంచిన తల ఎత్తకుండా స్మార్ట్ పోన్ ని చూస్తున్నారు. ఇలా అదే పనిగా ఫోన్ వాడుతూ, స్క్రోల్ చేసుకుంటూ కొత్త కొత్త వార్తల కోసం, అప్డేట్ల కోసం ఎదురుచూస్తున్నారా? నెగెటివ్ వార్తలు మీకు ఆసక్తిగా కనిపిస్తున్నాయా? అలాంటి వార్తల కోసం అదే పనిగా స్క్రోల్ చేస్తూ పోతున్నారా? ఐతే మీరు డూమ్ స్క్రోల్ వలలో చిక్కుకున్నట్లే.

అవును, కొత్త అప్డేట్ ఏదైనా వస్తుందన్న ఉద్దేశ్యంతో అదే పనిగా స్క్రోల్ చేస్తూ ఎక్కువ సమయాన్ని స్మార్ట్ ఫోన్ తోనే గడిపితే వారు డూమ్ స్క్రోలింగ్ తో బాధపడుతున్నట్లు లెక్క. దీనివల్ల అనేక మానసిక సమస్యలు వస్తుంటాయి. అందువల్ల దీని బారి నుండి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది.

మరి దీనికోసం ఏం చేయాలి?

ముందుగా, సోషల్ మీడియా సమాయాన్ని తగ్గించాలి. రోజుకి కొంత భాగం చొప్పున సోషల్ మీడియా వాడకూడదు. ముఖ్యంగా పడుకునేటపుడు, ఉదయం లేచేటపుడు స్క్రోల్ చేయడం ఆపేయండి.

ఆరోగ్యం సరిగా చూసుకోండి

వ్యాయామం, యోగా వంటివి ప్రాక్టీస్ చేయండి. అది మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాలు, పోషకాలు ఉన్నవాటిని మాత్రమే తీసుకోండి. దీనివల్ల మానసికంగా ఇబ్బంది రాకుండా ఉంటుంది.

మనస్ఫూర్తిగా ఉండడం మొదలు పెట్టండి

ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయండి. పొద్దున్న లేచింది మొదలు రాత్రిపడుకున్ వరకు అన్ని పనులు హాయినిచ్చేలా చేయాలి. చదవడం, రాయడం, వినడం, పనిచేసుకోవడం.. అన్నీ మనస్సు పెట్టి చేయండి.

స్టాప్ టెక్నిక్ ప్రయత్నించండి

స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారని మీకనిపిస్తే వెంటనే గట్టిగా స్టాప్ అని అరవండి. అలా కొన్ని సార్లు చేస్తూ ఉంటే మీ మెదడుకి ఇక చాలు అన్న సందేశం వెళ్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news