కరోనా రోజలు మళ్లీ వస్తున్నాయా అనిపిస్తోంది..అటు నిత్యవసరాల ధరలు పెరుగుతున్నాయి.. ఇటు ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి.. ప్రైవేట్‌లో ఏ జాబ్‌కు కన్ఫామ్ లేదు.. స్టాట్‌అప్ కంపెనీ అయినా..ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి దిగ్గజ సంస్థలు అయినా..ఉద్యోగులను నిర్థాక్షణంగా ఇంటికి పంపించేస్తున్నాయి.. ఏమైంది ఈ సొసైటీకి..ఒక వైపు లేఆఫ్స్, మరో వైపు మూన్‌లైటింగ్స్..! చెప్పాపెట్టకుండా కంపెనీలు తీసేస్తుంటే..చెప్పకుండా ఉద్యోగులు సైడ్ బిజినెస్ చేస్తున్నారు.. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు గూగుల్‌కూడా సమాయాత్తమవుతోంది. ఫేస్‌బుక్, ట్విటర్, సిస్కో, అమెజాన్ సరసన తాజాగా గూగుల్ కూడా చేరబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
గూగుల్.. తక్కువ పనితీరు కనబరుస్తోన్న ఉద్యోగులను ముందుగా ఇంటికి పంపించనున్నట్లు సమాచారం. అలాగే ఇకపై ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సాహకాలు, స్టాక్ అవార్డులను కూడా నిలిపివేయనుందట… గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ కొత్త మేనేజ్‌మెంట్ సిస్టంను అమలు చేస్తోందని నివేదికల్లో తేలింది.. దీని ద్వారా టీమ్ లీడర్‌లు, మేనేజర్‌లు తక్కువగా పనితీరు ఉన్న ఉద్యోగులను గుర్తించగలరని తెలిపింది. పనితీరు ఆధారంగా 6 శాతం మంది లేదా 10,000 వరకు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు సమాచారం.
వీరిని గుర్తించిన అనంతరం వచ్చే ఏడాది ప్రారంభం నుంచి గూగుల్ తొలగింపు ప్రక్రియ మొదలెడుతుంది.. ఐతే దీనికి సంబంధించి గూగుల్ ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువరించలేదు. యూకే పెట్టుబడి.. దారుహెడ్జ్ ఫండ్ బిలియనీర్ క్రిస్టోఫర్ హోన్- గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్‌కు రాసిన లేఖలో కొన్ని ముఖ్య సూచనలు చేసింది. కంపెనీలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉందని, ఇతర డిజిటల్ కంపెనీలతో పోలిస్తే తమ ఉద్యోగులకు అధిక వేతనాలు ఇస్తున్నట్లు పేర్కొంది.
యూకే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ నివేదిక ప్రకారం.. గూగుల్ హెడ్‌కౌంట్ అధికంగా ఉందని, 2021లో ఆల్ఫాబెట్ ఉద్యోగి సగటు జీతం దాదాపు 2,95,884 డాలర్లు. ఇది మైక్రోసాఫ్ట్ సంస్థ తన సిబ్బందికి చెల్లించే జీతం కంటే 70 శాతం ఎక్కువ. యునైటెడ్ స్టేట్స్‌లోని 20 అతిపెద్ద టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు చెల్లించే దాని కంటే కూడా ఆల్ఫాబెట్ తన ఉద్యోగులకు 153 శాతం అధికంగా ఇస్తోంది.. యూఎస్ ఆధారిత టెక్ కంపెనీలైన ట్విటర్, అమెజాన్, మెటా వంటి సంస్థలు కేవలం నెల రోజుల వ్యవధిలో ఖర్చులను తగ్గించుకునేందుకు ఇప్పటికే కోత మొదలేశాయి.