టైమ్ పాస్ కు పెంచుకున్న జుట్టుతో ప్రపంచ రికార్డు సాధించిన టీనేజీ గర్ల్

-

Gujarat's 'Real Life Rapunzel' Sets World Record With 5-Foot, 7-Inch Hair

మీకు రపుంజల్ క్యారెక్టర్ తెలుసు కదా. ఆ రపుంజల్ కు జుట్టు ఎంత పొడవుగా ఉంటుంది. సేమ్ టు సేమ్.. రియల్ లైఫ్ లో కూడా ఓ రంపుజల్ ఉంది. ఆమె జుట్టు కూడా ఎంత పొడవు ఉంది అంటే.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు ఉన్న టీనేజీ గర్ల్ గా ఆ అమ్మాయి గిన్నిస్ రికార్డు సాధించింది.

గుజరాత్ కు చెందిన నిలాంశి పటేలే ఈ ఫీటు సాధించింది. అ అమ్మాయికి 16 ఏళ్లే. తను 6 ఏళ్లు ఉన్నప్పుడు తనకు హెయిర్ కట్ చేయించారట తన తల్లిదండ్రులు. తనకు ఆ హెయిర్ కట్ నచ్చలేదట. దీంతో అప్పటి నుంచి ఎప్పుడూ హెయిర్ కట్ చేసుకోనని శపథం చేసిందట. అలాగే పెంచుతూ పోయిందట. 16 ఏళ్లు వచ్చిన తర్వాత ఇదిగో చూడండి.. ఎంత పొడవైందో. 5 అడుగులా 7 ఇంచుల పొడవు ఉందట ఇప్పుడు ఆ జుట్టు.

గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు తన దగ్గరికి వచ్చి ఆ జుట్టును కొలిచి ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు ఉన్న టీనేజీ గర్ల్ గా ధృవీకరించారు. ఆమెను రికార్డుల్లోకెక్కించారు.  

Read more RELATED
Recommended to you

Latest news