ప్రాచీనకాలంలో బాత్రూమ్స్ చూశారా..ఎంతో ఘోరంగా ఉన్నాయో..దీనికితోడు ఎలుకల సమస్య

>ఒకరంగా మనం చాలా అదృష్టవంతలం..ధనవంతులు కాకపోవచ్చు కానీ మౌళికవసతులైతే అందరికి ఉండేఉంటాయి. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నారా..ఆదిమానవుల కాలంలో వారు ఎదుర్కున్న కష్టాలు, అవమానాలు ఇప్పుడు లేవు. ఆదిమానవులు ఎలా బతికారో ఓసారి చరిత్ర చూస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ప్రాచీన రోమ్ కాలంలో ఎలాంటి మరుగుదొడ్లు వాడేవారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అసలు ఇలాంటి మరుగుదొడ్లను ఎలా వాడారా అని సందేహం వస్తుంది.

olden days bathrooms

మనకు కూడా ఇప్పుడు సామూహిక మరుగుదొడ్లు ఉంటాయి. అవి ప్రైవైసీగా ఉంటాయి. కానీ అప్పట్లో ప్రజలు సామూహికంగా మరుగుదొడ్లు వినియోగించేవారు. ఒక చెక్కబల్లపై వరుసగా రంధ్రాలు ఏర్పాటు చేసి వాటి కింద నుంచి నీరు ప్రవహించే విధంగా సెట్ చేసేవారట. టాయిలెట్ కు వెళ్లాలనుకునేవాళ్లు వచ్చి ఆ రంద్రాలపై కుర్చునేవారు. ఇంకా క్లీనింగ్ ఇప్పుడు మనం ఎలా అయితే బ్రష్ యూస్ చేస్తున్నామో..అప్పుడు జిలోస్పోంగియం అనే వస్తువుని వాడేవారు. అంటే పొడుగ్గా ఉన్న ఓ కర్రకి స్పాంజ్ ని అమర్చేవారు. దానినే నీటిలో ముంచి మలాన్ని శుభ్రపరిచేవారట.

అప్పట్లో ప్రజలు సామూహికం గానే మరుగుదొడ్లు వినియోగించేవారు. ఇప్పటిలోలా ప్రైవసీ ఉండేది కాదు. ఓ చెక్కబల్లపై వరుస గా రంద్రాలు ఏర్పాటు చేసి, వాటి కింద నీరు ప్రవహించే విధం గా ఏర్పాటు చేసేవారు. టాయిలెట్ కి వెళ్లాలనుకునే వారు వచ్చి ఆ రంద్రాలపై కూర్చుని పని పూర్తి చేసుకోవాలి. అలాగే, మలాన్ని శుభ్రపరుచుకోవడానికి జిలోస్పోంగియం అనే వస్తువుని వాడే వారట. జిలోస్పోంగియం అంటే.. పొడుగ్గా ఉన్న ఓ కర్రకి స్పాంజ్ ని అమర్చేవారు. దానినే నీటిలో ముంచి మలాన్ని శుభ్రపరుచుకునేవారు.

ఇంకా ధనవంతులు, కాస్త పరపతి కలిగిన వాళ్లు దీనిని శుభ్రపరిచటానికి వేడినీటిలో లేదా, వెనిగర్ లో వీటిని ముంచి క్లీన్ చేసి వాడేవారట. కానీ సామాన్యుల ఇళ్లలో ఇలాంటివి ఉండేవికాదు..దానితో ఒకరినుంచి మరొకరికి విచిత్రమైన అంటురోగాలు వచ్చేవట. ధనవంతులు తాము కుర్చునే సీట్లను కూడా పనివాళ్లతో వేడి చేయుంచుకునేవారట. బాక్టీరియా ఏమైనా ఉంటే ఇలా చేయటం ద్వారా సూక్ష్మజీవులు పోయేవట. అయినప్పటికి ఆ కాలంలో అంటువ్యాధుల సమస్య ఎక్కువగానే ఉండేది.

సామూహికం గా విసర్జన చేస్తున్న సమయం లో ఎక్కువ మొత్తం లో మలం వద్ద నుంచి మీథేన్ గ్యాస్ విడుదల అవ్వడం వలన విస్ఫోటనాలు సంభవించేవట. కొన్ని కొన్ని సార్లు అక్కడే తిరిగే ఎలుకలు వృషణాలను కొరికేస్తూ ఉండేవట. అబ్బా ఈమాజిన్ చేసుకోవాలంటేనే చాలా ఇబ్బంది అప్పట్లో జనాలు టాయిలెట్ కి వెళ్ళడానికి ఎంతగానో భయపడేవారు. తమ విసర్జన క్షేమంగానే జరగాలని తమ దేవత అయిన ఫార్చునాను ప్రార్ధించిన తరువాత విసర్జనకు వెళ్లేవారట. ఇది చదవడానికి ఎంతో జుగుప్సాకరంగా ఉన్నప్పటికి.. నాగరికత అభివృద్ధి చెందని కాలంలో అప్పటి వారు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారని చరిత్ర చెబుతోంది. మనం నాగరికత అభివృద్ధి చెంది కంప్యూటర్ కాలానికి వచ్చేశాక పుట్టాం. ఇప్పుడంతా..వెస్ట్ర్సన్ స్టైల్ లో అమేజింగ్ బాత్రూమ్స్ వచ్చేశాయి. అందుకే మనం అదృష్టవంతులు అన్నాం.

– Triveni Buskarowthu