నేడు తిరుమలకు సీజే ఎన్వీ రమణ..!

ఈ రోజు తిరుమల శ్రీవారి దర్శనానికి సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ వస్తున్నారు. ఇవాళ మద్యాహ్నం 1:35 గంటలకు సిజే రమణ రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తరవాత తిరుమల చేరుకుంటారు. సిజే రమణ తో పాటు ఆయన సతీమణి కూడా తిరుమల చేరుకుంటున్నారు.

జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శ్రీవారిని దర్శించుకుని…రాత్రి తిరుమలలో అక్కడే బస చేస్తారు. రేపు చక్రస్నానంలో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం 2:15 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్తారు. సీజే రమణ తిరుమల దర్శనానికి వస్తున్న నేపథ్యం లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర కుడా తిరుమలకు రానున్నారు. ఇదిలా ఉండగా సుప్రీం కోర్టు సిజేగా నియమించబడిన తరవాత రమణ తిరుమల కు విచ్చేయడం ఇది రెండోసారి.