200 లాటరీ టికెట్స్‌ కొన్నాడు.. ఆఖరికి అదృష్టం వరించింది.. ఏకంగా రూ. 8 కోట్లు..

మనకు ఏ నెంబర్‌ అయితే కలిసి వస్తుందో దాన్నే మనం లక్కీ నెంబర్‌గా అనుకుంటాం.. మనం ఈ భూమ్మీదకు వచ్చిన తేదీనే చాలామంది లక్కీనెంబర్‌గా భావిస్తారు. ఓ వ్యక్తి కూడా తను పుట్టిన తేదీ, సంవత్సరం లక్కీ అనుకుని ఆ నెంబర్‌ మీదే లాటరీ టికెట్‌ కొన్నాడు. లక్క్‌ గట్టిగా తగిలింది.. ఏకంగా రూ. 8 కోట్లు గెలిచాడు.

అలెగ్జాండ్రియాకు చెందిన అలీ అనే వ్యక్తి సెప్టెంబర్ 6న వర్జినియాలోని ఓ దుకాణం దగ్గర లాటరీ టికెట్ కొన్నాడు. ఆ లాటరీలో గెలిస్తే $1 మిలియన్ గెలుచుకోవచ్చు. అతను ఒక లాటరీ టికెట్ కొని సరిపెట్టుకోలేదు. ఒకేసారి 200 టికెట్లను కొనుగోలు చేశాడు. ఆ లాటరీ టికెట్లు అతనికి జాక్ పాట్ తెచ్చిపెట్టాయి. ఊహించని విధంగా అతనికి ఆ లాటరీ ద్వారా ఏకంగా రూ.8.1 కోట్లు వరించాయి.. అలీ కొనుగోలు చేసిన టికెట్లన్నింటిలో 0-2-6-5 సంఖ్యలే ఉన్నాయి. ఇక్కడ ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే అవి అతని పుట్టిన నెల, సంవత్సరం అని లాటరీ అధికారులు తెలిపారు. లాటరీ డ్రా తీయగా అతనికి $5000 విలువైన 200 టాప్ ప్రైజెస్ వచ్చాయి. వాటి విలువ సుమారు రూ.8 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు..

లాటరీ తగలడం అంటే మామూలు విషయం కాదు.. వీటిమీద పిచ్చి ఉన్నవాళ్లు అదేపనిగా టికెట్లు కొంటూనే ఉంటారు. కొన్నిసంవత్సరాల పాటు కొన్నా ఇంకా టికెట్‌ తగలక ఎదురుచూస్తున్న వాళ్లే ఎక్కువ. అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది..ఎలాంటి తెలివితేటలు పనికిరావు.. ఈ మధ్యనే ముప్పై ఏళ్ల పాటు వరుసగా లాటరీ టికెట్‌ కొన్న ఇద్దరికి ఆఖరికి లాటరీ తగలింది. వారి ఎదురుచూపులు ఫలించాయి. 50 వేల డాలర్ల విలువైన బహుమతిని వాళ్ళు గెలుచుకున్నారు. అంటే మన కరెన్సీలో రూ.39 లక్షలు గెలుచుకున్నారన్న మాట.

వీదేశాల్లో లాటరీ టికెట్‌ కొనే అలవాటు స్త్రీలు, పురుషులు ఇద్దరికీ ఎక్కువగానే ఉంటుంది. కొన్నిసార్లు అయితే భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య టికెట్స్‌ కొంటుంటారు.
Attachments area