ప్రియురాలి పై పగ తీర్చుకున్నాడు..అందరి మనసు దోచుకున్నాడు.. గ్రేట్ భయ్యా..

ప్రేమించేటప్పుడు జీవితం ఎలా ఉంటుంది అని ఎవ్వరూ ఆలొచించరు. పెళ్ళి చేసుకోవాలి అనే సమయంలో మాత్రమే అన్నీ గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తున్నారు..ఆ వ్యధతో చాలా మంది అబ్బాయిలు దిఫ్రెషన్ లోకి వెళ్తున్నారు.ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే కొందరు కుంగిపోతారు.. మరికొందరు ఆవేశంలో దారుణాలకు ఒడిగడుతుంటారు.. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు మాత్రం విభిన్నంగా ఆలోచించాడు..

ఎందుకూ పనికిరాడని పెళ్లికి నో చెప్పిన ప్రియురాలిపై అద్భుతంగా పగ తీర్చుకున్నాడు.. మాజీ ప్రియురాలి పేరు మీద ఓ టీ షాప్ ఓపెన్ చేశాడు.. అంతేకాదు భగ్న ప్రేమికులకు తన టీ షాప్‌లో డిస్కౌంట్ కూడా ఇస్తున్నాడు. అతని కథ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.. గుజ్జర్ అనే వ్యక్తి ఐదేళ్ల క్రితం ఓ అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయితో స్నేహం పెంచుకుని ప్రేమ వ్యవహారం కూడా సాగించింది. అయితే ఆ అమ్మాయి అంతర్‌కు షాకిచ్చి.. వేరొకరితో పెళ్లికి సిద్దమైంది. దాంతో ఆమెను అంతర్ నిలదీశాడు.

అతనికి సంపాదన లేదని కాదని వెళ్ళిపోయి వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. దీంతో అంతర్ కొన్ని రోజులు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఒక దశలో చనిపోవాలని కూడా అనుకున్నాడు. స్నేహితులు, కుటుంబ సభ్యుల ప్రోద్భలంతో మనసు మార్చుకున్నాడు. కల్చిపూర్ బస్టాండ్‌ దగ్గర్లో ఓ చాయ్ షాప్ ఓపెన్ చేశాడు. ఆ దుకాణానికి తన మాజీ ప్రియురాలి పేరు పెట్టాడు. ఎందుకంటే.. ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే తన పేరే పెట్టాలని ఆ అమ్మాయి ప్రేమలో ఉన్నప్పుడు అంతర్‌కు చెప్పిందట.ఇకపోతే బయట టీ ధర రూ.10 రూపాయలు ఉండగా, అతడు మాత్రం రూ.5 రూపాయలకే టీని విక్రయిస్తూ అందరి మనసును దోచుకున్నాడు.. ఇలా అందరూ ఆలోచిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు..