అందమైన ఎంపీ, సినీ నటి.. పెళ్లి చేసుకోబోతోంది.. ఎవరినో తెలుసా?

-

నస్రత్ జహాన్ మాత్రం ఎంపీ అయిన ఖుషీలోనే పెళ్లి కూడా చేసేసుకోవాలని ఫిక్స్ అయిపోయిందట. తను నిఖిల్ జైన్ అనే యువకుడితో ప్రేమలో ఉన్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అతడి ఫోటోను కూడా షేర్ చేసింది.

ఈసారి ఎంపీలుగా గెలిచిన వారిలో అందమైన యువతులు కూడా ఉన్నారు. వాళ్లు నటీమణులు. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన నస్రత్ జహాన్, మిమీ చక్రవర్తి ఇద్దరూ అందగత్తెలే. వీళ్లిద్దరూ టీఎంసీ(తృణముల్ కాంగ్రెస్) పార్టీ నుంచి మొదటి సారి పోటీ చేసి గెలుపొందారు.

వీళ్లిద్దరూ ఎంపీ అవగానే.. ఢిల్లీ వెళ్లి పార్లమెంట్ ముందు సెల్ఫీలు దిగి తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నెటిజన్లతో అక్షింతలు కూడా వేయించుకున్నారు కదా. సరే.. ఆ విషయం వదిలేద్దాం.

నస్రత్ జహాన్ మాత్రం ఎంపీ అయిన ఖుషీలోనే పెళ్లి కూడా చేసేసుకోవాలని ఫిక్స్ అయిపోయిందట. తను నిఖిల్ జైన్ అనే యువకుడితో ప్రేమలో ఉన్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అతడి ఫోటోను కూడా షేర్ చేసింది. ఇద్దరూ ఒకరిని మరొకరు ఇష్టపడుతున్నట్టు.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. నస్రత్ వేలికి ఉన్న ఉంగరాన్ని బట్టి చూస్తే… తనను పెళ్లి చేసుకోవాలంటూ నిఖిల్.. నస్రత్‌కు ప్రపోజ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్న ఈ అందమైన ఎంపీ.. పెళ్లి డేట్ మాత్రం చెప్పలేదు. కాకపోతే త్వరలోనే వాళ్ల పెళ్లి ఉంటుందట. నిఖిల్ జైన్ కోల్‌కతాకు చెందిన ఓ వ్యాపారవేత్త.

Read more RELATED
Recommended to you

Latest news