ఇండియాలో అత్య‌ధిక పారితోషికం తీసుకునే న‌టులు వీరే..!

బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్‌కు ఎంతటి స్టార్ డ‌మ్ వ‌చ్చిందో అంద‌రికీ తెలిసిందే. బాలీవుడ్‌లోనూ ప్ర‌భాస్‌కు ఇప్పుడు ఎంతో మంది ఫ్యాన్స్ ఏర్ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భాస్ ఒక్క సినిమాకు రూ.30 కోట్ల వ‌ర‌కు పారితోషికం తీసుకుంటాడ‌ని తెలిసింది.

ప్ర‌పంచంలోని అన్ని సినిమా ఇండ‌స్ట్రీల‌లోనూ భార‌తీయ సినీ ఇండ‌స్ట్రీకి ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. ఎన్నో వేల కోట్ల రూపాయ‌ల ట‌ర్నోవ‌ర్‌ను ఈ ఇండ‌స్ట్రీ ఏటా సాధిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన యాక్ట‌ర్లు తీసుకునే రెమ్యున‌రేష‌న్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అగ్ర హీరోలు, హీరోయిన్లు భారీ మొత్తంలో పారితోషికాల‌ను అందుకుంటుంటారు. ఇక ఈ విష‌యానికి వ‌స్తే ఓ సంస్థ చేసిన స‌ర్వే ప్ర‌కారం.. 2017 నాటికి దేశంలో అత్యంత భారీ స్థాయిలో పారితోషికాల‌ను అందుకుంటున్న న‌టీన‌టుల వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.

1. ర‌ణ‌బీర్ క‌పూర్

ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు రాజ్ క‌పూర్ మ‌న‌వ‌డు, న‌టీన‌టులు రిషిక‌పూర్‌, నీతు సింగ్‌ల కుమారుడైన ర‌ణ‌బీర్ క‌పూర్ మ‌న దేశంలోని సినీ ఇండ‌స్ట్రీల్లో అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న న‌టుల్లో 10వ స్థానంలో ఉన్నాడు. అత‌ను ఒక్క సినిమాకు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వ‌ర‌కు పారితోషికం తీసుకుంటాడ‌ట‌.

2. అమితాబ్ బ‌చ్చ‌న్

సీనియ‌ర్ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ వ‌య‌స్సులోనూ ఆయ‌న ఇంకా సినిమాల్లో న‌టిస్తూనే ఉన్నారు. ఇప్ప‌టికీ ఆయ‌న‌కు అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్ర‌మంలోనే అమితాబ్ ఒక్క సినిమాకు రూ.20 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటార‌ని తెలిసింది.

3. ర‌ణ్‌వీర్ సింగ్

నేటి త‌రం యువ న‌టుల్లో ర‌ణ్‌వీర్ సింగ్‌కు ఒక ప్ర‌త్యేక‌త ఉంది. ఏ సినిమాలో ఏ పాత్ర‌లోనైనా అవ‌లీల‌గా న‌టించి ఆ పాత్ర‌కు జీవం పోయ‌గ‌ల న‌ట‌నా శ‌క్తి ఇత‌నికి ఉంది. ఇత‌ను ఒక్క సినిమాకు రూ.20 కోట్లు తీసుకుంటాడ‌ట‌.

4. అజ‌య్ దేవ‌గ‌న్

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి కాజోల్ భ‌ర్త అజ‌య్ దేవ‌గ‌న్ త‌న నట‌నతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోగ‌ల‌డు. అడ‌పా ద‌డ‌పా ఇత‌ను చేసే సినిమాలు సక్సెస్‌ను సాధిస్తుంటాయి. ఇత‌ను ఒక్క సినిమాకు రూ.25 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటాడ‌ట‌.

5. ప్ర‌భాస్

బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్‌కు ఎంతటి స్టార్ డ‌మ్ వ‌చ్చిందో అంద‌రికీ తెలిసిందే. బాలీవుడ్‌లోనూ ప్ర‌భాస్‌కు ఇప్పుడు ఎంతో మంది ఫ్యాన్స్ ఏర్ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భాస్ ఒక్క సినిమాకు రూ.30 కోట్ల వ‌ర‌కు పారితోషికం తీసుకుంటాడ‌ని తెలిసింది.

6. హృతిక్ రోష‌న్

క‌హో నా ప్యార్ హై, క్రిష్ సినిమాల‌తో హృతిక్ రోష‌న్‌కు ఎంతో పేరు వ‌చ్చింద‌ని అంద‌రికీ తెలిసిందే. తెలుగులో ఎన్‌టీఆర్‌, అల్లు అర్జున్‌ల త‌ర‌హాలో హిందీలో హృతిక్ రోష‌న్‌కు డ్యాన్సు ప‌రంగా అంతే పేరు వ‌చ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక ఇత‌ను ఒక్క సినిమా చేస్తే రూ.40 కోట్ల వ‌ర‌కు పారితోషికం తీసుకుంటాడ‌ట‌.

7. అక్ష‌య్ కుమార్

అక్ష‌య్ కుమార్ చ‌క్క‌ని న‌టుడే కాదు, మాన‌వ‌త్వం ఉన్న గొప్ప మ‌నిషి కూడా. తోటి వారికి ఎప్పుడూ అత‌ను ఏదో ఒక స‌హాయం చేస్తూనే ఉంటాడు. అక్ష‌య్ చేసిన సినిమాల్లో చాలా వ‌ర‌కు హిట్ సినిమాలుగా నిలిచాయి. ఇక ఇత‌ను ఒక్క సినిమాకు రూ.40 కోట్ల వ‌ర‌కు పారితోషికం తీసుకుంటాడ‌ట‌.

8. షారుఖ్ ఖాన్

బాలీవుడ్ బాద్‌షాగా పేరున్న షారుఖ్ ఖాన్ న‌ట‌న ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న న‌ట‌న‌కు ఇప్ప‌టికే ఎన్నో అవార్డుల‌ను ఆయ‌న సొంతం చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే షారూఖ్ ఒక్క సినిమాకు రూ.45 కోట్ల వ‌రకు పారితోషికం తీసుకుంటాడ‌ని తెలిసింది.

9. స‌ల్మాన్‌ఖాన్

ప్ర‌పంచంలోనే అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న 100 మంది పాపుల‌ర్ సెల‌బ్రిటీల‌లో స‌ల్మాన్ 82వ స్థానంలో ఉన్నాడు. ఇత‌ను ఒక్క సినిమాకు రూ.60 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటాడ‌ట‌.

10. అమీర్‌ఖాన్

వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌ను చేయ‌డంలో అమీర్‌ఖాన్ ఎప్పుడూ ముందుంటాడు. ఎన్నో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సినిమాల్లో అమీర్ త‌న‌దైన శైలిలో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. ఈ క్ర‌మంలో అమీర్ ఒక్క సినిమా చేస్తే రూ.65 కోట్ల వ‌ర‌కు పారితోషికం తీసుకుంటాడ‌ని తెలిసింది.