గుర్రాన్ని రైలు తో పాటు విమానం కూడా ఎక్కిచ్చారు…! సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్…!

-

సాధారణంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు జంతువులను అనుమతించే అవకాశం ఉండదు. అవి పెంపుడు జంతువులు అయినా మరొకటి అయినా సరే వాటితో పాటు వెళ్ళాలి అంటే మన సొంత వాహనాలు ఉండాలి లేదా కిరాయి కి తీసుకుని తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వాలు అందించే సర్వీసుల్లో పెంపుడు జంతువులకు గాని, మరొకరకంగా పెంచుకునే వాటికి గాని ఏ విధమైన అనుమతీ ఉండదు అనేది వాస్తవం. దీనితో చాలా మంది ప్రయాణాలను వాయిదా వేసుకోవడమో లేక జంతువులను వదిలి వెళ్లడమో చేస్తూ ఉంటారు.

కాని అమెరికాలో ఒక గుర్రాన్ని మాత్రం రైలు లో అనుమతించారు అధికారులు. దానికి కారణం అది ప్రజలకు సేవ చేయడమెనట. ప్రపంచంలోనే అతి చిన్న గుర్రంగా ఉన్న సదరు గుర్రాన్ని ఈక్వైన్ నుంచి ప్రయాణికుడు కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ స్టేషన్ నుండి శాన్ఫ్రాన్సిస్కోకు తీసుకువెళ్ళాడు. గుర్రం రాక్‌రిడ్జ్ స్టేషన్‌లో రైలు ఎక్కింది, దాని యజమాని ఒక స్టేషన్ ఏజెంట్‌కు ఆ గుర్రానికి సంబంధించిన వివరాలను చూపించి దానిని ఎందుకు వినియోగిస్తున్నామో వివరించాడు దీనితో బే ఏరియా రాపిడ్ ట్రాన్సిట్ (BART),

న్యాయవాదులతో సంప్రదించిన అనంతరం రైలులో ఆ గుర్రాన్ని అనుమతించారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనతో రైలులో ఉన్న అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. రైలు ఎక్కగానే గుర్రం ఒక్కసారిగా నవ్వడం చూసారట అక్కడి ప్రయాణికులు. రైలు ఎక్కడమే ఒక వింత అనుకుంటే ఆ తర్వాత దానిని విమానంలోకి కూడా అనుమతించారు అధికారులు. ప్రస్తుతం ఈ గుర్రానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రైల్లో ఉన్న తెలుపు మరియు గోధుమ మినీ గుర్రం ఫోటో చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news