ఆ మహిళ కనురెప్పల వెంట్రుకలు ఎంత పొడుగో..!

మహిళల ముఖంలో కళ్లు చాలా ప్రత్యేకమైనవి. చాలా మంది వ్యక్తులు ఆ కళ్లను చూసే ఇష్టపడతారు. అదే ఆ కళ్లకు కనుబొమ్మలు, రెప్పలు లేకుండా ఉంటే.. చూడటానికి కూడా ఎవరూ ఇష్టపడరు. అందానికి కళ్లు ఎంత ముఖ్యమో.. కళ్లకు కనుబొమ్మలు, కనురెప్పలు అంతే ఇంపార్టెంట్. అప్పుడే అమ్మాయి ముఖం చంద్రబింబంలా మెరుస్తూ కనిపిస్తుంది. ఇవీ మహిళల అందాన్ని రెట్టింపు చేస్తాయి. అయితే సాధారణంగా కనురెప్పలపై ఉండే వెంట్రుకల పొడవు 1 నుంచి 2 సెంటీమీటర్లు కలిగి ఉంటాయి. కానీ ఈ రోజు అతి పొడవైన కనురెప్పల వెంట్రుకలు కలిగిన మహిళ గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం. ఈమె కనురెప్పల చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ప్రతి ఒక్కరూ ఈమె కనురెప్పల వెంట్రుకలు చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.

కనురెప్పల వెంట్రుకలు
కనురెప్పల వెంట్రుకలు

చైనాకు చెందిన జియాంక్సియా కనురెప్పల వెంట్రుకల పొడవు 12.40 సెంటీమీటర్లు (4.88 అంగుళాల పొడవు) ఉంటాయి. ఇంత పొడువైన కనురెప్పల వెంట్రుకలు ఉన్నాయంటే నమ్మలేకపోతున్నారు కదూ. అవును ఇది నిజమే. ఈమె కనురెప్పల వెంట్రుకలు ప్రపంచంలోనే అందరికంటే పొడవైనవి. అందుకే ఈమె పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో చేర్చబడింది. అయితే సాధారణంగా కనురెప్పలపై వెంట్రుకలు అప్పుడప్పుడు కళ్లకు మంట పుట్టినప్పుడు చిరాకు అనిపిస్తుంది. కానీ జియాంక్సియాకు అలాంటి సమస్య ఎప్పుడు ఎదుర్కొలేదంట. వెంట్రుకలు ఎంత పొడవైన ఎప్పుడూ కత్తిరించుకోవాలని అనుకునే వారు కాదంట. వాటిని కూడా శరీరంలో ఒక భాగంగా పరిగణించడంతో అవి అలా పెరిగాయని ఆమె చెప్పుకొచ్చింది.

పొడవైన కనురెప్పల సంరక్షణకు ఎప్పుడు కష్టపడలేదని జియాంక్సియా చెప్పుకొచ్చారు. రోజూ ముఖం కడిగేటప్పుడే వెంట్రుకలను శుభ్రం చేసుకునేదానినని చెప్పారు. అయితే ఈ వెంట్రుకలను ఎప్పుడు కత్తించాలని అనుకునే వారు కాదు. కానీ కొన్ని సందర్భాల్లో కత్తిరించినా.. అవి తిరిగి పెరిగేవని తెలిపారు. పొడవైన కనురెప్పల వెంట్రుకలు ఉండటం.. ప్రపంచ రికార్డుగా నమోదు కావడం చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ వెంట్రుకలతో అందంతోపాటు ఆరోగ్యాన్ని సూచిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, ఇంతకు ముందు ఈ రికార్డు కెనడాకు చెందిన గిలియన్ క్రిమినిసి పేరు మీద ఉండేది. ఆమె కనురెప్పల వెంట్రుకల పొడవు 8.07 సెంటీమీటర్లు.