కోవిడ్19: పాజిటివ్, హోమ్ ఐసోలేషన్ అయినప్పుడు చేయాల్సినవి, చేయకూడనివి…!

కరోనా సెకండ్ లెవెల్ తీవ్రంగా వ్యాపిస్తోంది. దీంతో అనేక మంది ఆస్పత్రిలో అడ్మిట్ అవుతున్నారు. ఆసుపత్రిలో బెడ్స్ కొరత కూడా ఏర్పడింది. డాక్టర్లు నర్సులు కంటే కూడా పేషెంట్లు సంఖ్యా చాలా ఎక్కువై పోతోంది. దీంతో ట్రీట్మెంట్ లో కూడా ఇబ్బందులు వస్తున్నాయి అయితే ఇటువంటి పరిస్థితుల్లో కోవిడ్19 మీకు వస్తే బయట పడటం కష్టమనే చెప్పాలి.

కొన్ని కొన్ని ప్రదేశాల్లో అయితే టెస్టులు చేయించుకోవడానికి కూడా అవసరమైన సర్వీస్లు లేవు ఇంటికి వచ్చి కరోనా శాంపిల్స్ కలెక్ట్ చేయడం కూడా అవడం లేదు. ఒకవేళ కనుక మీకు కరోనా పాజిటివ్ వచ్చి ఉంటుందనుకుంటే ఇవి చేయండి…!

మీరు సెపరేట్ రూమ్ లోకి వెళ్లిపోండి. అది కూడా అటాచ్ వాష్రూమ్ ఉన్న చోటుకి.
RT-PCR టెస్ట్ చేయించుకోండి.
ఇంట్లోనే ఉండండి. కొద్దిగా ఉంటే ఇంట్లోనే తగ్గిపోతుంది. హాస్పిటల్ కి వెళ్లక్కర్లేదు.
డాక్టర్ తో టచ్లో ఉండండి. మీ లక్షణాలన్నీ ట్రాక్ లో ఉంచుకోండి.
ఒకవేళ మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఇలాంటి ఎమర్జెన్సీ వార్నింగ్ సైన్ ఏమైనా ఉంటే అప్పుడు డాక్టర్ ని వెంటనే సంప్రదించండి.
మంచి నాణ్యత ఉన్న మాస్క్ వేసుకోండి N95 మాస్క్ వేసుకుంటే మరీ మంచిది.
దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కవర్ చేసుకోండి.
సబ్బు తో లేదా శానిటైజర్ తో చేతుల్ని శుభ్రంగా ఉంచుకోండి.
హైడ్రేట్ గా ఉండండి. రెస్ట్ తీసుకోండి.
మసాలా ఎక్కువున్న ఆహారం తీసుకోవద్దు. సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి.
మీ SPO2 లెవెల్స్ మీ పల్స్ మీటర్ తో చెక్ చేసుకుంటూ ఉండండి.
95 శాతం కంటే ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అయితే అప్పుడు డాక్టర్ని సంపాదించడం ముఖ్యం.
ప్రోనింగ్ పొజిషన్ లో పడుకోవడం ఇలాంటివి చేయండి.

ఇవి చేయొద్దు:

ఇతరులతో సామాన్లని, ఆహారాన్ని షేర్ చేసుకోవద్దు.
పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో వెళ్ళద్దు. మందులకి ఆసుపత్రికి మాత్రమే బయటికి వెళ్ళండి మిగిలిన సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళకండి.
పబ్లిక్ ప్రాంతాలకి వెళ్లొద్దు.

ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చిందంటే:

టెస్ట్ ని చేయించుకోండి.
ఇంట్లోనే ఉండండి మీ లక్షణాలని చూసుకుంటూ ఉండండి. అవసరమైతే డాక్టర్ ను సంప్రదించండి.
మీరు ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారు వాళ్లకి తెలియజేయండి.
సపరేట్ గా బాత్రూమ్ ఉన్న రూమ్ లోకి మారిపోండి.
రెస్ట్ తీసుకోండి.
పోషకాహారం తీసుకోండి, హైడ్రేట్ గా ఉండండి.
మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం చెయ్యండి.
జన సమూహం ప్రాంతాలకి వెళ్లడం మానేయండి.
మీరు వాడే టిష్యూస్ లాంటివన్నీ కూడా డస్ట్ బిన్ లో వెయ్యండి.

ఇవి చేయొద్దు:

మీ సామాన్లు, మంచం, ఆహారం మొదలైన వాటిని ఇతరులతో షేర్ చేసుకోవద్దు.
పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్ళద్దు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో వెళ్లొద్దు.
మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళదు. ఆస్పత్రికి మాత్రమే వెళ్ళండి.