సుడిగుండాలు ఎలా ఏర్ప‌డ‌తాయి.. ఇంట్ర‌స్టింగ్ ఫ్యాక్ట్స్‌..!

-

శాస్త్రీయంగా చూస్తే సుడి గుండాలు, వాయుగుండాలు ఒకే విషయానికి చెందిన అంశాలు. గుండ్రంగా తిరిగే నీటి ప్రవాహాన్ని సుడిగుండాలు అంటారు.  నీరు గుండ్రంగా తిరుగుతూ దగ్గరలోని పడవలను తలక్రిందులు చేస్తాయి అనేది అపోహ మాత్రమే. అయితే సాధారణ పరిభాషలో సుడిగుండాలంటే చెరువులు, సముద్రాలు, ఆనకట్టల నీళ్లల్లో ఏర్పడే సుడులు. గాలిలో ఏర్పడే ఇలాంటి సుడుల్నే వాయుగుండాలు లేదా సుడిగాలులు అంటుంటారు.

వాయులైయినా, నీరైనా ఇతర ద్రవాలైనా అవి ఒకచోట స్థిరంగా ఉండకుండా విస్తరిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని ప్రవాహకాలు అంటాం. అవి ప్రవహించేటప్పుడు వాటిలోని అన్ని పదార్థ భాగాలు ఒకే వేగంలో కదలవు. ఆ ప్రవాహకాల్లో ఉన్న అణువులు, కణాలు, తేలికపాటి శకలాలు పరస్పరం అడ్డుపడుతుంటాయి. తద్వారా ప్రవాహకంలో అన్ని ప్రాంతాలు ఒకే వేగంతో కాకుండా కొన్ని పొరలు వేగంగా మరికొన్ని పొరలు మెల్లగా కదులుతాయి. ఇలా సంభవించే అంతర్గత ఘర్షణ వల్ల కలిగే వేగాల తేడాను స్నిగ్ధత అంటాం.
నీటిలో గానీ, వాయువుల్లోగానీ, మరే ఇతర ప్రవాహకాలలోగానీ ఉష్ణోగ్రతా తేడాలు ఉన్నట్లయితే అవి సాంద్రతల్లో తేడాలకు దారితీస్తాయి.

పదార్థాలు అధిక సాంద్రత నుంచి అల్ప సాంద్రత వైపునకు ప్రవహించడం సహజం. ఆ క్రమంలో వేర్వేరు దిశల్లో స్నిగ్ధతలు వేర్వేరుగా ఉన్నట్లయితే సుడిగుండాలు, వాయుగుండాలు ఏర్పడ‌తాయి. మామూలు రోడ్ల మీద సుడిగాలుల నుంచి టోర్నడోల వరకు వీటి శక్తి మారుతూ ఉంటుంది. ఇక వాతావరణంలో మార్పుల వల్ల సముద్రం మీద ఏర్పడే సుడిగుండాలు ఎంత ప్రమాదంగా ఉంటాయో తెలిసిన విషయమే. వాస్త‌వానికి ఇవి ఎక్కువగా సముద్ర తీరాల్లో ఏర్పడుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version