కోపర్‌ఖైరానేకు చెందిన 20 ఏళ్ల బాలుడు శనివారం ఉదయం ప్రమాదవశాత్తు కేబుళ్ల వైర్లపై అడుగు పెట్టడంతో మంటలు చెలరేగి గాయాల పాలయ్యాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. తిలక్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్ధి శుభం సోనీ తన ఇంటికి 20 అడుగుల దూరంలో ఎడమ మలుపు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ కింద ఉన్న కేబుళ్ల ఉమ్మడిపై అనుకోకుండా అడుగు పెట్టడంతో మంటలు చెలరేగాయి.
దీంతో అతను ఈ ప్రమాదంలో 25% కాలిన గాయాలు ఎదుర్కొన్నాడు. ఈ సంఘటన యొక్క సిసిటివి ఫుటేజ్లో ఆ యువకుడు వైర్ మీద అడుగు పెట్టడం, తరువాత పరిగెత్తడం మరియు మంటలను అరికట్టడానికి తనపై నీరు పోసుకోవడం కనిపిస్తుంది. అయితే దీనిపై శుభం సోనీ తండ్రి జగదీష్ సోనీ మాట్లాడుతూ.. ఈ తీగలు చాలా కాలంగా బహిర్గతమవుతున్నాయి. కొంతకాలం క్రితం ఒక వాహనంపై కూడా ఇక్కడ మంటలు చెలరేగాయి. కాని ఎవరూ ఆ స్థలాన్ని గుర్తించలేదు.
ఇక తన కొడుకుకు 25% గాయాల పాలయ్యాడని.. కోలుకోవడానికి కనీసం ఒక నెల పడుతుందన్నారు. ఈ క్రమంలోనే చికిత్సకు సుమారు 3 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. అయితే మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎంఎస్‌ఇడిసిఎల్) తమకు కొంత ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పినప్పటికీ.. మాకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని జగదీష్ సోనీ తెలిపారు.
ఇదిలా ఉంటే.. మేము మూడు నెలల క్రితం సిమెంటులో వైర్లను కప్పాము. కాని అది వర్షంలో కొట్టుకుపోయింది. ఇక యువకుడు వైర్ల ఉమ్మడిపై అడుగు పెట్టాడు, దీనివల్ల స్పార్క్ పేలిందని ఎంఎస్‌ఇడిసిఎల్‌కు చెందిన ఒక అధికారి తెలిపారు. వైర్లు కప్పబడి ఉన్నాయని, అయితే ఎన్‌ఎంఎంసి కాంట్రాక్టర్లు డ్రైనేజీ పైపు వేయడానికి దాన్ని వెలికి తీశారని ఆయన చెప్పారు.