కలిసి ఉంటే కలదు సుఖం అన్న సంగతి అందరికి తెలిసిందే..ఉమ్మడిగా ఏదైనా చేస్తే దాని ఫలితం బాగుంటుందని ఓ గ్రామంలోని ప్రజలు ఋజువు చేసారు..అక్కడ అంతా రిచ్ గా ఉంటాయి.హైటెక్ హంగులతో ఉండే విలాసవంతమైన ఇళ్లు.. పెద్ద పెద్ద రోడ్లు.. ఖరీదైన కార్లు.. అబ్బో.. అక్కడ ఇలాంటివి చాలా ఉంటాయి. స్మార్ట్ సిటీలు కూడా దాని కింద పనికిరావు. ఆ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరూ కోటీశ్వరులే. ప్రతి వ్యక్తికి ఏడాదికి ఆదాయం 80 లక్షలకు పైగానే ఉంటుంది.
ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది అక్షర సత్యం..మన పక్కదేశం చైనాలో అలాంటి ఒక గ్రామం ఉంది.జియాగ్యిన్ నగరానికి సమీపంలో హువాజీ అనే గ్రామం ఉంటుంది. ప్రపంచంలోనే ధనిక గ్రామంగా దీనికి పేరుంది. ఇక్కడ నివసించే ప్రతి ఫ్యామిలీ.. నగరాల్లో నివసించే ధనవంతులతో సమానంగా సంపాదిస్తారు. ఇల్లు, కారు, లైఫ్ స్టైల్ కూడా గొప్పగా ఉంటుంది.
హువాజీ గ్రామంలో ఉండే ప్రతి ఇల్లు ఎంతో విలాసవంతంగా ఉంటుంది. ప్రతి ఫ్యామిలీకి ఖరీదై కార్లు ఉంటాయి. గ్రామం మొత్తం పచ్చదనంతో నిండి ఉంటుంది. పక్కా రోడ్లు అద్దాల్లా మెరుస్తాయి..అక్కడ ఉండే వాళ్ళు ఏదో జాబులు చేస్తున్నారు అని అనుకోకండి..వాళ్లంతా కూడా వ్యవసాయం చేసే రైతులే..ఏంటీ?.. మరి ఎలా సాధ్యం అనే ఆలోచన వస్తుంది కదూ..వారంతా నీ పొలం నీ ఇష్టం అని విడిగా వ్యవసాయం చేయరు..కలిసి ఉమ్మడి వ్యవసాయం చేస్తారు.దాంతో లాభాలు అధికంగా ఉంటాయి.. అందుకే ఇప్పుడు ఇలా రిచ్ ఉన్నారు. గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ ప్రెసిడెంట్ వు రెన్వావో గ్రామ ముఖచిత్రాన్నే మార్చారు.సామూహిక వ్యవసాయం అనే ఒకే ఒక్క ఐడియా.. వారి జీవితాన్నే మార్చేసిందట..ఇప్పటికీ అందరూ అలానే చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు..వాట్ ఏ ఐడియా..