గత ఎన్నికల్లో జగన్ వేవ్ ఎంత బలంగా వీచిందో అందరికీ గుర్తే ఉంటుంది…సరిగ్గా మూడేళ్ళ క్రితం జగన్ గాలిలో సైకిల్ అడ్రెస్ గల్లంతు అయింది…తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది…టీడీపీలో ఉన్న బడా బడా నేతలు సైతం ఓటమి పాలవ్వక తప్పలేదు. ఆఖరికి కుప్పంలో సైతం చంద్రబాబు మెజారిటీ తగ్గిందంటే జగన్ ప్రభావం ఎంత ఉందో చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే అంతటి జగన్ గాలిలో కూడా టీడీపీ 23 చోట్ల గెలిచింది…అంటే అక్కడ టీడీపీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో చెప్పాల్సిన పని లేదు. ఆ 23 స్థానాల్లో టీడీపీ కంచుకోటలు ఎక్కువే…ఏదో ఒకటి, రెండు సార్లు తప్ప మిగిలిన అన్నీ సార్లు ఆ నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తూనే వచ్చింది. ఇక అలా టీడీపీకి కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో ఈ సారి ఫ్యాన్ హవా ఉంటుందా? అంటే ఉండే అవకాశాలు లేకపోలేదనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ సీట్లని టీడీపీని కైవసం చేసుకోవచ్చు…అలాగే టీడీపీ సిట్టింగ్ సీట్లని వైసీపీ కైవసం చేసుకోవచ్చు.
ఇక ఇందులో టీడీపీ కంచుకోటలుగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగిరేలా ఉంది. అలా వైసీపీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇచ్చాపురం ఒకటి అని చెప్పొచ్చు…ఇక్కడ టీడీపీ కేవలం ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది..గత ఎన్నికల్లో కూడా ఇక్కడ టీడీపీ గెలిచింది…అయితే ఈ సారి మాత్రం ఇచ్చాపురంలో సీన్ రివర్స్ అయ్యే అవకాశం కనిపిస్తోంది