టైం దాటితే వీటి జోలికి వెళ్ళకండి.. వాడితే ప్రాణాలు పోతాయ్..

ఏ వస్తువుకైనా ఒక టైం అనేది ఉంటుంది.. ఆ టైం వరకూ వాటిని వాడితే ప్రాణాలకు ఎటువంటి హానీ ఉండదు.. ఒకవేళ ఏమౌతుంధి అని వాడితే తీవ్ర పరిమణామాలను ఎదుర్కొవాల్సి వస్తుంది..ఆ వస్తువులు ఏంటి? వాటి గురించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

 

బ్రష్ లు:

ఉదయం లేస్తూనే ఒకప్పుడు వేప పుల్లలతో పళ్ళు తోమే వాళ్ళు కానీ, ఇప్పుడు మాత్రం అందరూ బ్రష్ లను వాడుతున్నారు. వాటి వల్ల పళ్ళు కూడా శుభ్ర పడటంతో ఎక్కువ మంది వీటినే వాడుతున్నారు..అయితే, ఈ బ్రష్ లను ఆరేడు నెలలకే దాన్ని మార్చేయాలి. నిజానికి ఈ విషయంలోనే ఎక్కువ మంది నిర్లక్ష్యం చేస్తారు కూడా. ఒకవేళ ఆ సమయం కంటే ముందుగానే రంగు మారినా, వంకరపోయినా, కుచ్చులు ఊడిపోతున్నా, బిరుసెక్కినా… వెంటనే పడేయండి. లేదంటే అది శుభ్రం చేసే మాట అటుంచి, హానికరంగా మారుతుంది..

 

 

 

 

 

 

దువ్వెనలు:

వీటిని రెండు రోజులకోసారైనా శుభ్రం చేయాలి. వేడినీళ్లలో బేకింగ్‌ సోడా వేసి దువ్వెనల్ని కాసేపు నానబెట్టి కడగాలి. శుభ్రం చేస్తున్నాము కదా అని ఏళ్ల తరబడి వాడకూడదు.. ఏడాదికి పడేయ్యాలి..ఇది తప్పక గుర్తుంచుకోండి.

ఇన్నెర్స్:

చాలామంది చేసే పొరపాటు ఇదే. వీటిని ఏళ్ల తరబడి వాడేస్తుంటారు. నిత్యం ఒంటిని అతుక్కుని ఉండే వీటికి చెమట వల్ల బ్యాక్టీరియా ముప్పు ఎక్కువే. అలర్జీలు, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లూ వచ్చే ప్రమాదం ఉంది. తరచూ వాడటం వల్ల ఇవి ఆకృతిని కోల్పోతాయి. అయినా ధరిస్తే వెన్ను నొప్పి, ఇతరత్రా సమస్యలూ ఆరు నెలలు లేదా ఏడాదికి మించి వాడకూడదు..

న్యాప్‌కిన్లు:

న్యాప్‌కిన్లను ఎప్పటికప్పుడు అంటే వాడిన తర్వాత వాటిని వెంటనే ఉతికెయ్యాలి..నూనె, జిడ్డు, ఇతరత్రా ఫంగస్‌, బ్యాక్టీరియా వంటివన్నీ దీన్లో చేరిపోతాయి. అందుకే ఉతికేటప్పుడు కాస్త బేకింగ్‌ సోడా కూడా వేయాలి. ప్రతి మూడు నెలలకోసారైనా వీటిని మార్చేయడం మంచిది..

తల దిండు:

ఇవి లేకుండా మాత్రం చాలా మందికి నిద్ర పట్టదు..ఒకే దిండుని ఏళ్ల తరబడి వాడితే మాత్రం మెడనొప్పి ఇబ్బంది పెడుతుంది. అంతేకాదు మనకంటికి కనిపించని బ్యాక్టీరియా ముఖంపైకి చేరి శ్వాస సమస్యలతో పాటు… అలర్జీలూ వస్తాయి. రెండేళ్ళకు ఒకసారి మార్చాలి..