బంగారు నగలు నల్లగా అయిపోతే వాటి యొక్క అందం పోతుంది. అటువంటి నగలను వేసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు కూడా. అందుకనే బంగారు నగలను ఎంతో కష్టపడి క్లీన్ చేస్తుంటారు. మీ బంగారు నగలు నల్లగా అయిపోతే ఇలా శుభ్రం చేసుకోండి. ఇవి ఎంతో ఈజీ. కనుక ఈ టిప్స్ ని అనుసరిస్తే ఖచ్చితంగా బంగారు నగలు వెంటనే తళతళా మెరిసిపోతాయి. మరి ఎలా బంగారు నగల్ని అందంగా మార్చచ్చు అనేది చూద్దాం.
బీర్:
బీర్ ను ఉపయోగించి మనం బంగారు నగలని అందంగా మార్చుకోవచ్చు. ఒక క్లాత్ ని బీర్ లో ముంచి దానిని బంగారు నగల మీద రాస్తే నల్లగా ఉండే నగలు అందంగా మారుతాయి.
కొద్దిగా సాల్ట్:
మొదట గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో సాల్ట్ వేసి బ్రష్ సహాయంతో నగలను అందులో వేసి క్లీన్ చేయండి ఇలా చేస్తే కూడా బంగారు నగలు తళతళా మెరిసిపోతాయి.
టమాటా కెచప్ :
టమాటా కెచప్ ని ఉపయోగించి కూడా మీరు బంగారు నగలను అందం గా మార్చుకోవచ్చు. కొద్దిగా టమాటా కెచప్ తీసుకుని అందులో నగలను వెయ్యండి. కాసేపు వదిలేసి క్లీన్ చెయ్యండి అంతే.
పేస్టు:
పేస్ట్ తో కూడా మీరు బంగారు నగలు శుభ్రం చెయ్యచ్చు. పేస్ట్ తో క్లీన్ చేస్తే బంగారు నగలు మెరుస్తాయి.
వెనిగర్:
వెనిగర్ బేకింగ్ సోడా కలిపి మీరు బంగారు నగలని తోమితే అందంగా మారుతాయి. మెరిసిపోతాయి.