ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే.. ఎంతో లాభం…!

-

ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే సగం సమస్యలు పరిష్కారమవుతాయి. గంట సేపు ప్రశాంతంగా కూర్చొని జీవితం, సమస్యల గురించి ఆలోచిస్తే దానికంటూ సొల్యూషన్ దొరుకుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ డబ్బు, కెరియర్ అంటూ పరుగులు పెడుతున్నారు. నిమిషం తీరిక లేకుండా పరుగులు పెడుతున్నారు. సమస్య వచ్చినా ఆ సమస్యకు సొల్యూషన్ వెతికేంత క్షణం కూడా దొరకడం లేదనే చెప్పుకోవచ్చు. దీంతో సమస్యలు పెరిగి.. మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

alone
alone

అయితే, వీలున్నంత వరకు.. కొంచెం సేపు ఖాళీగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉండకుండా.. నచ్చిన ప్రాంతానికి వెళ్లి ఒంటరిగా కూర్చోవాలి. ఆ సమయంలో ఏ పని పెట్టుకోవద్దు. ప్రశాంతంగా, హాయిగా కూర్చోవాలి. దీంతో శరీరానికి, మనసుకు విరామం దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని వారు అంటున్నారు.

అవగాహన..

సమస్యలు ఉన్నప్పుడు ఒంటరిగా కూర్చోవాలి. గంట సేపు ఆ సమస్య గురించి ఆలోచించి.. ప్రాబ్లమ్ మొదలు నుంచి ప్రస్తుత పరిస్థితి వరకు ఆలోచించాలి. దీంతో మీకంటూ ఆ సమస్యపై అవగాహన ఏర్పడుతుంది. సమస్యకు గల కారణాలు తెలిసిన తర్వాత.. ఈజీగా పరిష్కరించుకోవచ్చు. ఒంటరిగా కూర్చొని ఆలోచించడం ద్వారా భావోద్వేగాలు అదుపులో ఉంటాయని, ఫలితంగా భవిష్యత్‌లో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటారని నిపుణులు పేర్కొంటున్నారు.

మానసిక బలం..

ఒంటరిగా కూర్చొని ఆలోచించడానికి ఎంతో ఓపిక, ధైర్యం కావాలని నిపుణులు వెల్లడిస్తున్నారు. బిజీగా ఉండటం వల్ల మనల్నీ మనం మర్చిపోతామని.. ఆలోచనలు కుదురుగా ఉండదంటున్నారు. ఒంటరిగా ఉండటం వల్ల మానసిక బలం చేకూరుతుందని వారు పేర్కొన్నారు.

ఏకాగ్రత..

ఏ పని చేయాలనుకున్న ఏకాగ్రత ఎంతో అవసరం. ఒక విషయంపై దృష్టి పెట్టాలని భావించినప్పుడు ఏకాగ్రత ముఖ్యపాత్ర పోషిస్తుంది. మనసుకు శిక్షణ ఇచ్చినప్పుడు ఏకాగ్రత సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఆలోచనలు, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.

Read more RELATED
Recommended to you

Latest news