మత్తు ఎక్కించే తేనె.. తాగితే స్వర్గలోకం.. డోస్‌ ఎక్కువైతే పైకే..!

-

తేనె తియ్యగా ఉంటుంది. తింటే ఆరోగ్యానికి మంచిది..కానీ ఈ తేనె తింటే కిక్కు మాములుగా ఎక్కదు. తేనె తాగితే మత్తు ఏంట్రా అనుకుంటున్నారా.. ఇది మత్తెక్కించే హనీ మరీ..! అన్నీ చోట్లా ఇది దొరకదు. నేపాల్‌లోనే ఇది ఎక్కువగా దొరుకుతుంది. నేపాల్‌ ప్రజలు ఈ తేనెను ఎన్నో ఏళ్లగా వాడుతున్నారు. మత్తు ఎక్కుతుంది కదా అని ఎక్కువ తీసుకుంటే.. శాశ్వతంగా మత్తులోకి పోతారు..అంత డేంజర్ మ్యాడ్‌ హనీ ఇది..!
ఎలా తయారవుతుందంటే.. 
2018లో ఈ మ్యాడ్ హనీపై అధ్యయనం చేశారు. దీన్ని క్రీస్తుపూర్వం 2100 నుంచి నేపాల్‌లో ఉపయోగిస్తున్నట్టు అధ్యయనంలో తేలింది. దీన్ని పూర్వకాలం నుంచి ఔషధంగా వాడేవారు. ఈ తేనెలో గ్రేయనోటాక్సిన్స్ అని పిలిచే మత్తును కలిగించే విషపూరితమైన పదార్థం ఉంది. ఈ మత్తు పదార్ధం రోడోడెండ్రాన్ జాతి మొక్కలకు పూసే పూల పుప్పొడిలో లభిస్తుంది. ఆ పూల నుంచి తేనెను గ్రహించిన తేనెటీగల వల్ల ఇలాంటి మ్యాడ్ హనీ చేస్తారు. ఈ తేనెను మితంగా ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది జీర్ణాశయాంతర సమస్యలను తగ్గిస్తుంది. అలాగే లైంగిక శక్తిని పెంచుతుంది. అజీర్తి, పొట్టలో పుండ్లు,  వంటివి ఉండవు. అలాగే దీర్ఘకాలం పాటూ మితంగా తాగితే అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
టర్కీలో కూడా…
నేపాల్‌లో ఇప్పటికీ దీన్ని ఔషధంగానే ఉపయోగిస్తున్నారు. ఇది నేపాల్‌లో అధికంగా దొరుకుతున్నప్పటికీ టర్కీలోని బ్లాక్ సీ ప్రాంతంలో ఉన్న తేనెటీగలు కూడా ఇలాంటి మ్యాడ్ హనీ తేనెపట్టును కడుతున్నాయట..
ప్రాణాంతకం ఎందుకంటే..
ఈ తేనె మద్యం కన్నా ఎక్కువ కిక్కును ఎక్కిస్తుంది. రోజుకు మితంగా అరస్పూను తాగితే చాలు. అతిగా తాగితే మాత్రం మత్తెక్కిపోతుంది. ఊహాలోకంలో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది. అనేక భ్రాంతులు కలగడం మొదలవుతుంది. మైకంగా అనిపిస్తుంది. ఆ మైకంలో చాలా ఆనందం కలుగుతుంది. ఇక్కడి వరకూ సీన్‌ బానే ఉంది.. కానీ మోతాదు పెరిగితే వాంతులు, వికారం, మూర్ఛ వస్తుంది. అలాగు గుండె కొట్టుకునే వేగం మారిపోయి అరిథ్మియా వంటి గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావొచ్చు.
విదేశాల నుంచి వస్తారట..
ఈ తేనె కోసం విదేశీయులు ఎంతో మంది ప్రత్యేకంగా నేపాల్ వస్తారు. దాన్ని ఔషధంగా భావించి తమతో తీసుకెళ్తారట… తక్కువ మోతాదులో తాగుతూ ఆరోగ్యసమస్యలను పరిష్కరించుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news