ఇదేంద‌య్యా ఇది.. ఏకంగా సింహాన్నే ప‌రుగులు పెట్టిస్తున్న ముంగీస‌..!

నిజానికి అడ‌వికి రాజు అన‌గానే మ‌న‌కు గుర్తుకొచ్చేది సింహం మాత్ర‌మే. దీని పంజా ప‌డిందంటే ఎంత పెద్ద జంతువు అయినా స‌రే దానికి ఆహారం కావాల్సిందే. మ‌రి అంత‌టి సింహాన్ని బెదిరించే జంతువు ఏదైనా ఉంటుందా అంటే అది అసామాన్య‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే దాన్ని ఓడించాలంటే అంత ఈజీ కాదు. అందుకే పెద్ద పెద్ద గుంపులుగా ఉండే జంతువులు కూడా ఒక్క సింహాన్ని చూడగానే ప‌రుగులు పెడ‌తాయ‌ని చెప్పాల్సిందే.ఇక అంత‌టి బ‌ల‌మైన సింహాన్ని కూడా అప్పుడ‌ప్పుడు కొన్ని చిన్న చిన్న జంతువులు కూడా భ‌య‌పెట్ట‌డం అప్పుడ‌ప్పుడు ఊస్తూ ఉంటాం. ఇక ఇప్పుడు కూడా అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఏంటంటే సింహాన్ని ఓ చిన్న ముంగీస రఫ్ఫాడించిన వీడియో ఇప్పుడు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

ఈ వీడియోలో సింహం ముందు కుప్పిగంతులు వేయడంతోపాటు దాన్ని భయపెట్టి ఏకంగా బెదరగొట్టింది. సింహానికి ఎదురెళ్లిన ముంగీస ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా ఇలా సింహాన్ని బెద‌ర‌గొట్ట‌డం అంటే మామూలు విష‌యం కాద‌నే చెప్పాలి. ఇక పెద్ద పెద్ద జంతువును కూడా ఈజీగా భ‌య‌పెట్టే సింహం ఇలా చిన్న జంతువుకే భ‌యప‌డిపోవ‌డం చాలా అరుదైన ఘ‌ట‌నే చెప్పాలి. కాగా ఇప్పుడు ముంగీస‌కు సోష‌ల్ మీడియాలో చాలా ర‌కాల కామెంట్లు వ‌స్తున్నాయి.