అదొక దెయ్యాల దీవి.. వ్యాధి పేరుతో 1,60,000 మందిని చంపిన డాక్టర్లు..

-

ఏ టైంలో అయినా సరే. ఇంట్రస్టింగ్‌గా మాట్లాడుకునేది..దెయ్యాల గురించి. వీటి గురించి వినడం అంటే చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. ఇప్పుడు అలాంటిది ఓ దెయ్యాల దీవి గురించి మాట్లాడుకుందామా..! ఇటలీ.. వెనిస్‌, లిడో తీరంగలో పోవెగ్లియా దీవి ఉంది. దీన్ని పిశాచాల దీవి అంటారు. కొన్ని దశాబ్దాల నుంచి ఆ దీవిలో ఎవరూ ఉండటం లేదు. ఓ రకమైన వ్యాధి సోకిన వారిని చిత్ర హింసలు పెట్టారు. 1,60,000 మంది చనిపోయారు. మొత్తానికి దెయ్యాల దీవిగా పేరున్న ఈ దీవి గురించి మరన్ని విషయాలు మీకోసం.!
పోవెగ్లియా దీవిలో బ్లాక్ డెత్ వ్యాధి సోకిన పేషెంట్లను చిత్రహింసలు పెట్టి చంపారు. అంత మంది చనిపోయే సరికి.. అక్కడికి పర్యాటకులు కూడా వెళ్లకుండా నిషేధించారు. అయితే ఈ మధ్య ఇద్దరు టూరిస్టులు ఈ దీవిలోకి వెళ్లారట. దీవిలో దెయ్యాల సంగతి పక్కన పెడితే.. అదో అందమైన దీవి..
ఇటలీ ఉత్తర ప్రాంతంలోని స్వర్గంలో అడుగుపెట్టినట్లే. దీవి చుట్టూ నీలి రంగులో సముద్ర నీరు కనిపిస్తుంది. అందమైన తీరాలు ఆకట్టుకుంటాయి. దీవి మధ్యలో ఉన్న చర్చి చుట్టూ అల్లుకున్న పచ్చదనం మనసుకు ప్రశాంతతనిస్తుంది.

నరకం చూసిన ప్రజలు..

ఒకప్పుడు అక్కడ మనుషులు నడిచినప్పుడు పడిన పాదముద్రలు.. నేడు దుమ్ములా మారిపోయాయి. అప్పటి రోగుల ఆర్తనాదాలు, ఆవేదనలు, కష్టాలకు ఆస్పత్రి గోడలు సాక్ష్యాలుగా నిలిచాయి. టార్చర్ భరించలేక చనిపోయేవాళ్లను తగలబెట్టేందుకు అక్కడ 18 ఎకరాల స్థలం ఉంది. ఇటలీలో బ్లాక్ డెత్ (Black Death) వ్యాధి మరింత మందికి ప్రబలకుండా ఉండేందుకు మొత్తం 1,60,000 మందిని తగలబెట్టి చంపినట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఆ దీవిలోని మట్టిలో దాదాపు 50 శాతం బూడిద కనిపిస్తుంది. అదంతా అప్పట్లో తగలబెట్టిన మనుషులదే అని అంటుంటారు. ఓ వ్యాధి వల్ల మనుషులను ఈ రకంగా హింసించారు.

దెయ్యాలు వెంటాడాయా?

యూట్యూబ్‌లోని ఓ ట్రావెల్ ఛానెల్ రిపోర్ట్ ప్రకారం… 1930లో ఓ శాడిస్ట్ డాక్టర్… చర్చి దగ్గరున్న బెల్ టవర్ ఎక్కి అక్కడి నుంచి కిందకు దూకి చనిపోయాడు. అతన్ని పిశాచాలే వెంటాడి చంపాయి అని కొందరు అంటారు. దాంతో అందరిలోనూ దెయ్యాల భయం మొదలైంది. ఆ తర్వాత బెల్ టవర్‌కి ఉన్న గంటను తొలగించారు. అయితే హైలెట్‌ ఏంటంటే.. గంటలు తీసేసినప్పటికీ.. దీవికి దగ్గర్లో ఉన్న ప్రజలకు ఇప్పటికీ అప్పుడప్పుడూ ఆ దీవి నుంచి గంట శబ్దాలు వినిపిస్తూ ఉంటాయట. బ్రిటన్‌కి చెందిన ఇద్దరు అర్బన్ ఎక్స్‌ప్లోరర్స్… ఆ దీవిలోకి వెళ్లారు. 40 ఏళ్ల మాట్ నాదిన్, 54 ఏళ్ల ఆండీ థాంప్సన్.. కొన్ని వీడియోలు తీశారు. వాళ్లు దీవిలోని మారుమూల ప్రదేశాలకు కూడా చేరుకున్నారు.

శాడిస్ట్‌ డాక్టర్‌…

యూరప్ నుంచి బ్లాక్ డెత్ వ్యాధి వెళ్లిపోయిన తర్వాత… పోవెగ్లియాకి స్వేచ్ఛ లభించినట్లే అనుకున్నారు. అక్కడ మానసిక రోగుల ఆస్పత్రి ఉండటంతో.. 1900 సమయంలో అక్కడ కొందరు డాక్టర్లు సేవలు అందించేవారు. అయితే ఓ డాక్టర్ మాత్రం తన రోగుల్ని హింసిస్తూ, చంపేసేవాడు. వారిని అత్యంత దారుణంగా ముక్కలు ముక్కలుగా కోసి చంపేవాడట. తన పేషెంట్లపై అతను విచిత్రమైన ప్రయోగాలు చేసేవాడట.. అక్కడ తనకోసం ఓ ల్యాబ్ ఏర్పాటు చేసుకొని… ప్రమాదకర హ్యాండ్ డ్రిల్స్‌తో రోగుల్ని కోసి హింసించేవాడు. ఇప్పటికీ అవి ఆ గదిలో అలాగే ఉన్నాయి. అతని చేతిలో చనిపోయే రోగుల ఆర్తనాదాలు… మిగతా రోగులకు ముచ్చెమటలు పట్టించేవి.
సౌత్ యార్క్ షైర్‌లో సేల్స్‌మేన్ అయిన మాట్ నాదిన్…అక్కడ ఫుటేజ్‌ని తన యూట్యూబ్ ఛానెల్ Finders Beepers History Seekersలో పోస్ట్ చేశారు. ఆయన తరచుగా ఆండీ థాంప్సన్‌తో కలిసి… పాత భవనాలు, మనుషులు తిరగని ప్రాంతాలకు వెళ్తున్నారు. మాట్ నాదిన్… ఈ దీవి గురించి చిత్రమైన విషయాలు చెప్పారు. ఆ దీవికి వెళ్లబోతున్నట్లు పోలీసులకు చెబితే ఆశ్చర్యపోయారు. ఓ కారు డ్రైవరైతే భయపడ్డాడు. అంతలా ఏముందని అక్కడికి వెళ్లారట.. మాకు కూడా ఎంత త్వరగా అక్కడి నుంచి బయటపడతామా అనిపించింది. ఆ దీవి చరిత్ర అంతా చీకటిమయం. ఎంతో మందికి అది నరకం. అక్కడ దెయ్యాలున్నాయని దీవి చుట్టుపక్కల వారు చెబుతారు. చాలా మందిని అక్కడ తగలబెట్టి… అలాగే వదిలేశారు.
మొత్తానికి ఆ దీవిలో అలా మారింది. ఓ వ్యాధి వల్ల మనుషులను అంతలా హింసించారు. ఇలాంటివి మన చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అప్పట్లో మనుషులన్నా. వారి ప్రాణాలన్నా చాలా తక్కువగా చూసేవారు. ఇప్పుడున్న పరిస్థితులకు 1700-1900 కాలం నాటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. ఆ రోజుల్లో మనుషులు విపరీతంగా అణిచివేతకు గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news