షిప్‌లో ఉన్న ప్ర‌యాణికుల‌కు 2వేల ఐఫోన్ల‌ను ఉచితంగా అంద‌జేసిన జ‌పాన్‌.. ఎందుకంటే..?

-

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఓ షిప్‌లో క్వారంటైన్‌లో ఉంచ‌బ‌డిన ప్ర‌యాణికుల‌కు జ‌పాన్ ప్ర‌భుత్వం ఏకంగా 2వేల ఐఫోన్ల‌ను ఉచితంగా అంద‌జేసింది. జ‌పాన్‌కు చెందిన డైమండ్ ప్రిన్సెస్ అన‌బ‌డే ఓ క్రూయిజ్ షిప్‌ను గ‌త కొద్ది రోజుల కింద‌ట అక్క‌డి ప్ర‌భుత్వం క్వారంటైన్‌లో ఉంచింది. షిప్‌లో ప్ర‌యాణిస్తున్న 3700 మంది ప్ర‌యాణికుల్లో 350 మందికి క‌రోనా వైర‌స్ ఉన్న‌ట్లు నిర్దార‌ణ కావ‌డంతో ఆ షిప్‌ను పూర్తిగా స‌ముద్రంలోనే ఉంచి దాన్ని జ‌పాన్ ప్ర‌భుత్వం క్వారంటైన్‌లో ఉంచింది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆ ప్ర‌యాణికుల‌కు జ‌పాన్ 2వేల ఐఫోన్ల‌ను ఉచితంగా అంద‌జేసింది.

Japan given 2000 iphones free for ship passengers

జ‌పాన్‌కు చెందిన లైన్ అన‌బ‌డే ఓ యాప్‌ను స‌ద‌రు షిప్‌లో ఉండే ప్ర‌యాణికులు వాడుకునేందుకు గాను త‌మ దేశంలో రిజిస్ట‌ర్ అయిన ఐఫోన్ల‌ను వారికి అందజేసిన‌ట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ క్ర‌మంలో ఈ యాప్ ద్వారా వారు బ‌య‌టి ప్ర‌పంచంలో జ‌రుగుతున్న విష‌యాల‌ను తెలుసుకోవ‌డంతోపాటు జ‌పాన్‌లో ఉన్న నిపుణులైన వైద్యుల‌చే చికిత్స అందుకునేందుకు వీలుంటుంద‌ని జపాన్ తెలిపింది. అందులో భాగంగానే షిప్‌లో ఉన్న ఒక్కో గ‌దికి క‌నీసం ఒక్క ఐఫోన్ ఉండేలా 2వేల ఐఫోన్ల‌ను అంద‌జేసిన‌ట్లు అక్క‌డి అధికారులు తెలిపారు. కాగా ఈ నెల 19వ తేదీ త‌రువాత ఆ షిప్‌ను తిరిగి పోర్టుకు ర‌ప్పించ‌నున్నార‌ని తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news