ఖమ్మం ఎండుమిర్చికి జెమిని వైరస్.. కారంలో కూడా బతికేస్తుందంటా..!

-

ఖమ్మం ఎండు మిర్చికి డిమాండ్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ఖమ్మంలోనే మిర్చిపంట ఎక్కువగా సాగు అవుతోంది. అయితే ప్రస్తుతం కొత్త కొత్త వైరస్‌ల పేర్లు వింటున్నాం. మానవాళిని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్, కోళ్లకు మధ్యలో బర్డ్ ఫ్లూ.. ఇలా అనేక వైరస్ పేర్లు వింటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఓ కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. మిర్చిపంటకు సోకే ఈ వైరస్ గురించి.. అది ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకుందాం రండి.

gemini virus
gemini virus

సాధారణంగా ఏ పంటకైనా బ్యాక్టీరియాలు దాడి చేస్తాయి. బ్యాక్టీరియాల కంటే వైరస్ ఎప్పుడూ ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. ఖమ్మం జిల్లాలో మిర్చి పంటకు వచ్చిన వైరస్‌ను ‘జెమిని’గా గుర్తించారు శాస్త్రవేత్తలు. అయితే ఈ వైరస్ ప్రమాదకరమైందని వారు చెబుతున్నారు. ఈ వైరస్ బొబ్బర తెగులుకు చెందిందన్నారు. ప్రస్తుతం ఈ వైరస్ ఖమ్మం జిల్లాలోని ఎంకూరు, కొణిజర్ల, మధిర, కామేపల్లి, తిరుమలయపాలెం మండలాల్లో విస్తరించిందని పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ ప్రభావంతో మిర్చిపంట సాగు తగ్గిపోతుందని రైతులు చెబుతున్నారు.

అయితే సాధారణంగా ఎండు మిర్చికి కారం ఎక్కువ. కాబట్టి వాటికి ఎలాంటి తెగుళ్లూ సోకవని భావిస్తుంటారు. కానీ జెమిని వైరస్ కారాన్ని, ఘాటును కూడా తట్టుకోగలదు. ఈ వైరస్ ప్రభావం వల్ల ఇప్పటికే ఎకరాకు 500 కేజీల వరకు దిగుబడి తగ్గిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మిర్చి పంట వేసేందుకు ఎకరాకు రూ.1.10 లక్షల నుంచి రూ.1.25 లక్షల వరకు పెట్టుబడి పెడతారు. అయితే ఎకరాకు 10 క్వింటాళ్లపైగా దిగుబడి వస్తేనే రైతుకి లాభం వస్తుంది. అయితే జెమిని వైరస్ వైట్ ఫ్లై అనే ఎగిరే పురుగు ద్వారా మిర్చి పంటకు చేరుకుని పంటను నాశనం చేస్తుంది. మొక్కల ఆకులు ముడుచుకునేలా చేసి.. పెరిగే దశలోనే నాశనం చేస్తుంది. మిర్చి మొగ్గలు రాకుండా చేస్తుందని, దీంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోతుందని రైతులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news