శృంగారం: ముద్దు పెట్టేటపుడు చేసే కొన్ని తప్పులు.. తెలుసుకోవాల్సిన పరిష్కారాలు.

ముద్దు ప్రేమకి చిహ్నం. ఆత్మీయమైన పెదవుల తాకిడి అవతలి వారికి అందమైన అనుభూతిని అందిస్తుంది. ముద్దుల్లో చాలా రకాలున్నాయి. ముఖ్యంగా పెదాలపై ఇచ్చే ముద్దుకి చాలా ప్రత్యేకత ఉంది. ప్రేమ ప్రకటనలో శిఖరాగ్రాన్ని చేరుకుని అక్కడ నుండి శరీరాలను కలిపే వంతెనలా ఈ ముద్దు పనిచేస్తుంది. మరి ఇలాంటి ముద్దు ఇచ్చేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవేంటో తెలుసుకుని, వాటికి పరిష్కారాలు కనుక్కుందాం.

నోటి దుర్వాసన

పెదాల మీద ముద్దుకి ఇది పెద్ద ప్రతిబంధకంగా పనిచేస్తుంది. ఉల్లిపాయ తిన్న తర్వాత నోటి నుండి దుర్వాసన రావడం సహజం. అలాంటప్పుడు జేబులో కొన్ని పుదీనా ఆకులని ఉంచుకోవడం ఉత్తమం.

నాలుక పని

పెదాల మీద ముద్దు ఫ్రెంచ్ కిస్ గా మారుతున్నప్పుడు నాలుకకి మరీ ఎక్కువగా పనిచెప్పడం అవతలి వారిని ఇబ్బంది పెడుతుంది. అలా అని అసలు నాలుకకి పని చెప్పకపోతే ముద్దులో మజా మిస్ అవుతుంది. అందుకే ఏది ఎంత చేయాలో అంతే చేయాలి.

చేతుల పని

ముద్దు పెట్టేటపుడు చేతులు ఖాళీగా ఉంచకూడదు. దానివల్ల అవతలి వారికి మన అన్న భావం రాదు. చేతులు అవతలి వారి మీద పడ్డప్పుడే ఆ ఫీలింగ్ కలుగుతుంది. అందుకే చేతులకి పనిచెప్పాలి.

పెదవి కొరకడం

సున్నితంగా పెదవిని కొరికితే మరింత రసవత్తరంగా ఉంటుంది. కానీ అదే కొంచెం ఎక్కువైనా అవతలి వారికి ఇబ్బంది కలుగుతుంది.

కళ్ళు తెరవడం

కళ్ళు తెరిచి ముద్దు పెట్టడం ఎవ్వరికీ నచ్చదు. ముద్దు పెట్టుకున్నప్పుడు వేరే ప్రపంచంలోకి వెళ్ళాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. అందుకే కళ్ళు తెరిచి ముద్దు పెట్టుకోకూడదు.

పగిలిన పెదాలు

పగిలిన పెదాలని ముద్దు పెట్టుకోవాలని ఎవరికీ అనిపించదు. అలా పెట్టుకోవడం కూడా భయంకరంగా ఉంటుంది. అందుకే డేట్ కి వెళ్ళే ముందు లిప్ బామ్ అప్లై చేసుకుంటూ ఉండడం మంచిది.