మహిళలకు శుభవార్త : భారీగా తగ్గిన బంగారం ధరలు

-

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్‌ న్యూస్‌. ఇవాళ బంగార ధరలు మరో సారి తగ్గాయి. నిన్నటి రోజున నిలకడగా ఉన్న బంగారం ధరలు… ఇవాళ కాస్త తగ్గాయి.  హైదరాబాద్ మార్కెట్‌ లో ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే…. హైదరాబాద్ లో శుక్ర వారం బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110కు తగ్గింది. దీంతో రేటు రూ.48,000కు చేరింది. ఇది ఇలా ఉంటే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది.

 

బంగారం ధరలు

రూ.100 తగ్గుదలతో రూ. 44,000కు చేరింది. అదే విధంగా విజయవాడలోనూ ఇదే రేట్లు వున్నాయి. అటు అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు కొంతమేర తగ్గడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. కరోనా తగ్గుముఖం పట్టడం కూడా బంగారం తగ్గుదలకు కారణమని నిపుణులు అంటున్నారు. ఇక బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధరలు రూ. 300 తగ్గి రూ. 73,100 వద్ద కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news