శరీరంపై హోలీ రంగులు పడ్డాయా? అవి పోవాలంటే ఇలా చేయండి..!

-

మీరు రంగుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. సహజసిద్ధమైన రంగులైతే పర్లేదు కానీ.. కెమికల్స్ వాడితే ప్రమాదమే.

హోలీ హోలీల రంగ హోలీ.. చమ్మకేలిల హోలీ అంటూ హోలీని ఎంజాయ్ చేశారా? మరి.. హోలీ అంటే రంగులు పూసుకోవడమే కదా. శరీరంపై పడ్డ హోలీ రంగులు పోవాలంటే ఎలా? ఏం చేయాలి.. మామూలుగా నీటితో కడిగితే అవి పోవు. అందుకే ఆ రంగులను పోగొట్టుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

know these tricks to take off holi colour from your skin

హోలీ ఆడేముందు ఇలా చేయండి..

హోలీ ఆడటానికి ముందే ముఖానికి ఆలీవ్ ఆయిల్ పూసుకోండి. ఒకవేళ ఆలీవ్ ఆయిల్ దొరక్కపోతే కొబ్బరినూనె అయినా ఓకే. కాళ్లకు, చేతులకు మొత్తం బాడీ మొత్తం నూనెను రాసుకోండి. ఒకవేళ ఏ ఆయిల్ దొరక్కపోతే వాజిలెన్ అయినా పర్లేదు. ఆలీవ్ ఆయిల్ అయితే బెటర్. ఎందుకంటే దాని వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది.

చేతి గోర్లు, కాలి గోర్లకు ఆల్మండ్ ఆయిల్ రాసుకోండి. కుదిరితే విటమిన్ ఆయిల్‌తో మసాజ్ చేయండి. తర్వాత నెయిల్ కలర్‌ను వేసుకోండి. దీంతో రంగులు గోర్ల మీద పడ్డా అంతగా ఎఫెక్ట్ ఉండదు.

హోలీ అంటే ఎండలో ఆడాల్సి ఉంటుంది. ఎండ నుంచి రక్షణ కోసం సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోండి. సన్ గ్లాసెస్ వాడినా ఓకే.

రంగులు పోవాలంటే ఇలా చేయండి..

మీపై ఎవరైనా కలర్స్ వేయగానే వెంటనే వాటిని నీటితో కడగండి. లేటయితే అవి శరీరానికి అతుక్కొని పోతాయి. వీలైతే గోరు వెచ్చని నీటితో కడగండి. గ్లిజరిన్, సీ సాల్ట్ కలిపిన నీటితో అయితే రంగులు త్వరగా పోతాయి.

ఏదైనా ఆయిల్ ఉంటే రంగులు ఉన్న దగ్గర రాయండి. ఆయిల్‌తో రాసిన తర్వాత వాటర్‌తో క్లీన్ చేసుకొని ఏదైనా మాయిశ్చరైజేషన్ క్రీమ్ రాయండి.
జుట్టుకు అంటుకున్న రంగులు పోవాలంటే మైల్డ్ షాంపుతో క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఆలీవ్ ఆయిల్, తేనె, నిమ్మరసం కలిపి జుట్టుకు ప్యాక్ వేసుకోండి. అది జుట్టును రంగుల వల్ల కలిగే హానీల నుంచి కాపాడుతుంది.

మీరు రంగుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. సహజసిద్ధమైన రంగులైతే పర్లేదు కానీ.. కెమికల్స్ వాడితే ప్రమాదమే.

Read more RELATED
Recommended to you

Latest news