బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ ఎవరన్నది ఇంకా ఫైనల్ అవలేదు. ఎన్.టి.ఆర్ హోస్ట్ గా సీజన్ 3 వస్తుందని భావించగా తారక్ అందుకు సుముఖంగా లేడని తెలుస్తుంది. ఇక ఇదిలాఉంటే తారక్ ప్లేస్ లో కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా చేస్తాడని రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. మీలో ఎవరు కోటీశ్వరుడు హోస్ట్ గా సక్సెస్ అయిన నాగార్జున బిగ్ బాస్ ను హ్యాండిల్ చేయగలడని అనుకున్నారు.
కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ కు నాగార్జున కూడా షాక్ ఇచ్చాడని తెలుస్తుంది. బిగ్ బాస్ హోస్ట్ ఆఫర్ వచ్చినా నాగ్ చేయనని చెప్పేశాడట. వీక్ లో ఒకసారి ఫుల్ డే షూట్ చేయాల్సి ఉంటుంది. రెమ్యునరేషన్ భారీగా ఇస్తానన్న ఈ టైంలో రిస్క్ ఎందుకని నాగార్జున సారీ చెప్పాడట. అయితే నాగార్జున ప్లేస్ లో యువ హీరో విజయ్ దేవరకొండని బిగ్ బాస్ హోస్ట్ గా తీసుకుంటున్నారని తెలుస్తుంది.
అతి తక్కువకాలంలో స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. మిగా స్టార్స్ అంతా ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా ఉండటం వల్ల విజయ్ దేవరకొండకు బిగ్ బాస్ హోస్ట్ ఛాన్స్ వచ్చిందట. అయితే విజయ్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. విజయ్ కాదంటే మరి ఆ ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి.