కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ న్యూరోలాజికల్ హాస్పిటల్ వైద్యులు మెదడు దగ్గర నాసికా కుహరం లోపల సూది ఉండి బాధపడుతూ ఉన్న 50 ఏళ్ల వ్యక్తిని కాపాడారు. పుర్రె భాగాన్ని తెరవడం ద్వారా శస్త్రచికిత్స చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్ కోల్‌కతా (INK) సీనియర్ డాక్టర్ ఒకరు మాట్లాడుతూ…. విజయవంతంగా మా వద్దకు వచ్చిన మెదడులో సూది ఉండి బాధపడుతున్న వ్యక్తికి శస్త్ర చికిత్స చేసినట్లు తెలిపారు. ఇటీవల ఆ వ్యక్తి ఆస్పత్రికి వచ్చినపుడు ముక్కు మీద గాయాలతో మరియు తాగి ఉన్నాడు. ఇలా గాయాలతో ఉన్నాడు కాబట్టి అతడికి ఏదైనా ప్రమాదం జరిగిందా లేక ఎరైనా కొట్టారా అన్నది తమకు ఎటువంటి అవగాహన లేదని ఆయన వివరించాడు. కానీ అతడిని కాపాడేందుకు మేము అతడి మెదడు CT స్కాన్ తీయగా…. షాకింగ్ విషయాలు తెలిసాయి. అతని ముక్కు నుండి మెదడు వరకు సూది విస్తరించి ఉన్నట్లు ఆ స్కానింగ్ లో బయటపడిందని ఆయన వివరించాడు.
అతడి నాసికా కుహరం లోపల లోహ వస్తువు ఉన్నప్పటికీ, వైద్యపరంగా సరిగా మరియు పూర్తిగా స్పృహలో ఉన్నాడు. అయితే, అక్కడ సూది ఎలా ప్రవేశించిందో స్పష్టంగా తెలియలేదు. అతను మామూలుగా మాట్లాడుతున్నాడు. మామూలుగా ఎగువ మరియు దిగువ అవయవాలను కదిలించగలుగుతున్నాడని డాక్టర్ చెబుతూ ఆశ్చర్యపోయాడు. ముక్కు నుండి మెదడుకు సూది ప్రయాణించే ఖచ్చితమైన మార్గం గురించి తెలుసుకునేందుకు డాక్టర్లు అతడికి యాంజియోగ్రామ్ చేశారు. అప్పుడు స్కల్ బేస్ సర్జరీ కోసం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం మనిషి మెదడును ముందుగా ఓపెన్ చేసి… ఆపై ముక్కు నుండి సూదిని బయటకు తీసినట్లు పేర్కొన్నాడు.