కొత్త కారు కొనాల‌నుకునే వారికి మ‌హీంద్రా ఆఫ‌ర్లు.. రూ.80వేల వ‌ర‌కు డిస్కౌంట్‌..

Join Our Community
follow manalokam on social media

కొత్త‌గా కారును కొనాల‌ని అనుకుంటున్నారా ? అయితే మ‌హీంద్రా అద్భుత‌మైన ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది. అనేక మోడ‌ల్స్‌పై ఆఫ‌ర్ల‌తోపాటు భారీ రాయితీల‌ను కూడా అందిస్తోంది. మ‌హీంద్రాకు చెందిన ఎక్స్‌యూవీ500, మ‌రాజో, స్కార్పియో, ఎక్స్‌యూవీ300 త‌దిత‌ర మోడ‌ల్స్ పై రాయితీల‌ను అందిస్తున్నారు. అమ్మ‌కాల‌ను పెంచుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా మ‌హీంద్రా ఈ ఆఫ‌ర్ల‌ను అందిస్తుండ‌గా.. ఈ నెల చివ‌రి వ‌ర‌కు ఇందుకు గ‌డువు ఇచ్చారు. ఆ లోపు ఆయా వాహ‌నాల‌ను కొనుగోలు చేసి ఆఫ‌ర్ల‌ను, రాయితీల‌ను పొంద‌వ‌చ్చు.

mahindra offers huge discounts on its car models

మ‌హీంద్రాకు చెందిన ఎక్స్‌యూవీ 500పై రూ.36,800 డిస్కౌంట్ ల‌భిస్తుంది. మ‌రో రూ.80,800 ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. ఈ కార్ ప్రారంభ ధ‌ర రూ.13.83 ల‌క్ష‌లుగా ఉంది. అలాగే రూ.20వేల ఎక్స్ఛేంజ్ బోన‌స్‌, మ‌రో రూ.9వేల కార్పొరేట్ డిస్కౌంట్‌, రూ.15వేల విలువైన యాక్స‌స‌రీల‌ను ఉచితంగా అందిస్తారు.

మ‌హీంద్రాకు చెందిన మ‌రాజో కార్‌ను కొనుగోలు చేస్తే రూ.20వేల డిస్కౌంట్‌, రూ.41వేల ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. ఎక్స్ఛేంజ్ బోన‌స్ రూ.15వేలు ఇస్తారు. మ‌రో రూ.6వేలు కార్పొరేట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది.

మ‌హీంద్రాకు చెందిన స్కార్పియో కార్ ప్రారంభ ధ‌ర రూ.12.67 ల‌క్ష‌లు ఉండ‌గా దీనిపై వినియోగ‌దారుల‌కు రూ.39,500 రాయితీ ల‌భిస్తుంది. రూ.15వేల ఎక్స్‌ఛేంజ్ బోన‌స్‌, రూ.10వేల వ‌ర‌కు క్యాష్ డిస్కౌంట్‌, రూ.4500 కార్పొరేట్ డిస్కౌంట్‌, రూ.10వేల విలువైన యాక్స‌స‌రీలు ఉచితంగా ల‌భిస్తాయి.

మ‌హీంద్రా ఎక్స్‌యూవీ300ను కొనుగోలు చేస్తే రూ.10వేల క్యాష్ డిస్కౌంట్‌, రూ.25వేల ఎక్స్‌ఛేంజ్ బోన‌స్‌, రూ.4500 కార్పొరేట్ డిస్కౌంట్‌, రూ.5వేల విలువైన యాక్స‌స‌రీల‌ను అందిస్తారు. ఈ కార్ ప్రారంభ ధ‌ర రూ.7.95 ల‌క్ష‌లుగా ఉంది.

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...